IPL 2025 : ఎవ్వ‌రితో మాకు సంబంధం లేదు.. మా రూటే స‌ప‌రేట్ అంటున్న గుజ‌రాత్ టైటాన్స్‌..

మిగిలిన అన్ని జ‌ట్లు పునః ప్రారంభ తేదీ కోసం ఎదురుచూస్తుండ‌గా గుజ‌రాత్ టైటాన్స్ మాత్రం ఓ అడుగుముందుకు వేసింది.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ అద‌ర‌గొడుతుంది. శుభ్‌మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలో ఈ సీజ‌న్‌లో 11 మ్యాచ్‌లు ఆడ‌గా 8 మ్యాచ్‌ల్లో విజ‌యాల‌ను న‌మోదు చేసింది. మూడు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. 16 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.793గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లో గుజ‌రాత్ మ‌రో మూడు మ్యాచ్‌లు ఢిల్లీ, ల‌క్నో, చెన్నైల‌తో ఆడ‌నుంది.

భార‌త్‌, పాక్ ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ఐపీఎల్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డంతో బీసీసీఐ ఐపీఎల్‌ను రీస్టార్ట్ చేసేందుకు స‌న్నాహ‌కాలు మొద‌లుపెట్టింది. మంగ‌ళ‌వారం నాటికి అన్ని జ‌ట్లు కూడా త‌మ త‌మ ప్లేయ‌ర్ల‌తో హోంగ్రౌండ్‌కు చేరుకోవాల‌ని బీసీసీఐ ఇప్ప‌టికే ఫ్రాంచైజీల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

IPL 2025 : మే 16 నుంచే ఐపీఎల్..! నాలుగు వేదిక‌ల్లోనే మ్యాచ్‌లు..!

మే 16 లేదా 17 నుంచి ఐపీఎల్‌ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ చూస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో మిగిలిన అన్ని జ‌ట్లు పునః ప్రారంభ తేదీ కోసం ఎదురుచూస్తుండ‌గా గుజ‌రాత్ టైటాన్స్ మాత్రం ఓ అడుగుముందుకు వేసింది. ఆదివారం నుంచి అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ మొద‌లుపెట్టింది. జోస్ బట్లర్, జెరాల్డ్ కోట్జీ మినహా మిగిలిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు మొత్తం ప్రాక్టీస్‌లో నిమ‌గ్న‌మైంది. స్వ‌దేశానికి వెళ్లిన వారు అవ‌స‌రం అయితే తిరిగి వ‌స్తార‌ని గుజ‌రాత్ టైటాన్స్ వ‌ర్గాలు తెలిపాయి.

PSL 2025 : ఎవ‌రు ఏమైనా చెప్పండి.. జ‌న్మ‌లో పాక్‌లో అడుగుపెట్ట‌న‌న్న మిచెల్‌.. చిన్న‌పిల్లాడిలా ఏడ్చిన టామ్ కరన్.. పీఎస్ఎల్‌లో విదేశీ క్రికెట‌ర్ల అనుభ‌వాలు..

ఈ సీజన్‌లో గుజరాత్ ఆట‌గాళ్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సీజన్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన టాప్‌-5 బ్యాట‌ర్లలో ముగ్గురు గుజ‌రాత్ ఆట‌గాళ్లు సాయి సుదర్శన్(509 ప‌రుగులు), గిల్ (508 ప‌రుగులు), బట్లర్ (500 ప‌రుగులు)లు ఉన్నారు. పర్పుల్ క్యాప్ రేసులో ప్రసిద్ధ్ కృష్ణ (20 వికెట్లు) తొలి స్థానంలో ఉన్నాడు.