IPL 2025: ఐపీఎల్ పునః ప్రారంభం వేళ గుజరాత్ టైటాన్స్‌కు బిగ్‌షాక్.. హ్యాండిచ్చిన మ్యాచ్ విన్నర్.. జట్టులోకి శ్రీలంక ప్లేయర్

ఐపీఎల్ పున: ప్రారంభం వేళ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుకు కష్టాలు వెంటాడుతున్నాయి.

Gujarat Titans

IPL 2025: ఐపీఎల్ – 2025 సీజన్ శనివారం నుంచి పున: ప్రారంభం అవుతుంది. శనివారం సాయంత్రం ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఐపీఎల్ పున: ప్రారంభం వేళ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుకు కష్టాలు వెంటాడుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ కు శుభమన్ గిల్ సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఆ జట్టు 11 మ్యాచ్ లు ఆడగా.. ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించి 16 పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచింది. లీగ్ దశలో మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. దాదాపు ఆ జట్లు ప్లేఆఫ్స్ కు చేరుకుంది. ప్రస్తుతం ఆ జట్టుకు కొత్త తలనొప్పి వచ్చిపడింది.

IPL 2025: ఐపీఎల్‌లో మిగిలిన గేమ్స్‌కు దూరమయ్యే విదేశీ ఆటగాళ్లు వీరే.. ఆ జట్లకు బిగ్‌షాక్

గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడంలో జోస్ బట్లర్ పాత్ర కూడా కీలకం. ఈ ఐపీఎల్ సీజన్ లో బట్లర్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. జాతీయ జట్టు తరపున మ్యాచ్ లు ఆడేందుకు బట్లర్ మే 26న స్వదేశానికి వెళ్లనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన అనంతరం బట్లర్ గుజరాత్ జట్టును వీడి వెళ్లనున్నాడు. అయితే, ప్లేఆఫ్స్ మ్యాచ్ లకు బట్లర్ దూరమవడం గుజరాత్ జట్టుకు గట్టిదెబ్బేనని చెప్పొచ్చు. అయితే, బట్లర్ స్థానంలో ఆ జట్టు యాజమాన్యం శ్రీలంక ప్లేయర్ కుశాల్ మెండిస్ ను తీసుకుంది. మెండిస్ ను రూ.75లక్షలకు తీసుకుంది.

Also Read: IPL 2025: ఢిల్లీ జట్టుకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్.. డీసీ ప్రకటించిన కొన్నిగంటలకే యూఏఈకి పయనం..

ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ భారాన్ని సాయి సుదర్శన్ (509 పరుగులు), శుభమన్ గిల్ (508), జోష్ బట్లర్ (500) మోస్తున్నారు. ఇప్పుడు బట్లర్ దూరం కావడంతో గుజరాత్ టైటాన్స్‌ బ్యాటింగ్ కష్టాలు పెరిగే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్ చేరినా.. అక్కడి నుంచి ముందుకు వెళ్లడం ఆ జట్టుకు బిగ్ టాస్క్ అనే చెప్పొచ్చు.
లీగ్ దశలో మిగిలిన మూడు మ్యాచ్ లను గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (మే 18న), లక్నో సూపర్ జెయింట్స్ (మే 22న), చెన్నై సూపర్ కింగ్స్ (మే 25న)తో ఆడనుంది.