IPL 2025: ఐపీఎల్‌లో మిగిలిన గేమ్స్‌కు దూరమయ్యే విదేశీ ఆటగాళ్లు వీరే.. ఆ జట్లకు బిగ్‌షాక్

మే17వ తేదీ నుంచి తిరిగి ఆరంభం కానున్న ఐపీఎల్ -18సీజన్ జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది.

IPL 2025: ఐపీఎల్‌లో మిగిలిన గేమ్స్‌కు దూరమయ్యే విదేశీ ఆటగాళ్లు వీరే.. ఆ జట్లకు బిగ్‌షాక్

IPL 2025

Updated On : May 16, 2025 / 7:05 AM IST

IPL 2025: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తల కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ పున: ప్రారంభం అవుతుంది. మే17వ తేదీ నుంచి తిరిగి ఆరంభం కానున్న ఐపీఎల్ -18సీజన్ జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే, ఈ సీజన్ అర్ధంతరంగా నిలిచిపోవటంతో విదేశీ ఆటగాళ్లు చాలామంది తమ దేశాలకు వెళ్లిపోయారు. వెళ్లిన వాళ్లలో మళ్లీ ఐపీఎల్ లో ఆడేందుకు తిరిగొచ్చేవారి సంఖ్య తక్కువగానే ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు వచ్చే నెల 11 నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్స్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడాల్సి ఉండగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లకు అంతర్జాతీయ సిరీస్ లు ఉన్నాయి. దీంతో ఆ దేశాల ఆటగాళ్లలో చాలామంది పున:ప్రారంభం అవుతున్న ఐపీఎల్ కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది.

Also Read: Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. క్లారిటీ ఇచ్చిన ష‌మీ..

ఐపీఎల్‌లో ఆడే విదేశీ ఆటగాళ్లు వీరే..
పంజాబ్ జట్టు : బార్ట్‌లెట్, అజ్మతుల్లా, మిచెల్ ఒవెన్
బెంగళూరు : లివింగ్ స్టన్, సాల్ట్, రొమారియో షెఫర్డ్
ముంబయి : ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ రెహ్మాన్.
హైదరాబాద్ : కమిన్స్, హెడ్, క్లాసెన్.
కోల్ కతా : రసెల్, నరైన్, రోమన్ పావెల్, డికాక్, గుర్బాజ్.
చెన్నై సూపర్ కింగ్స్ : నూర్ అహ్మద్, బ్రెవిస్, పతిరన, డెవన్ కాన్వే

 

ఐపీఎల్‌కు దూరమయ్యే విదేశీ ఆటగాళ్లు వీరే..
గుజరాత్ : రబాడ, షెఫానీ రూథర్ ఫర్డ్, కొయెట్జీ
ఢిల్లీ : మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రెజర్, ట్రిస్టన్ స్లబ్స్.
బెంగళూరు : జోష్ హాజిల్‌వుడ్, జాకబ్ బెథెల్, లుంగిసాని ఎంగిడి
లక్నో : మార్ క్రమ్.
పంజాబ్ : మార్కో యాన్సెన్
ముంబయి : రికిల్ టన్.
చెన్నై : సామ్ కరన్.
రాజస్థాన్ : జోఫ్రా ఆర్చర్

ఈ ప్లేయర్లు కూడా అనుమానమే..
పంజాబ్ : స్టాయినిస్, ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ.
గుజరాత్ : జోస్ బట్లర్.
ముంబయి : విల్ జాక్స్, కార్బిన్ బోష్.
సన్ రైజర్స్ : ఇషాన్ మలింగ, కమిందు మెండిస్, వియాన్ ముల్డర్.
చెన్నై : రచిన్ రవీంద్ర,
కోల్ కతా : మొయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్.

నోట్: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ వివరాలను పొందుపర్చడం జరిగింది. రెండురోజుల్లో మ్యాచ్ లు ప్రారంభమయ్యే సమయానికి ఈ జాబితాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.