IPL 2025 : ఐపీఎల్ ప్రియులకు పండగే.. యుద్ధం ముగిసింది.. మళ్లీ మ్యాచ్‌లు స్టార్ట్ అయినట్టే..

IPL 2025 : భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఐపీఎల్ 2025 వచ్చే వారం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

PBKS vs DC

IPL 2025 : ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు పండగే.. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. భారత్, పాక్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరుదేశాలు అధికారికంగా కాల్పుల విరమణను ప్రకటించాయి.

3 రోజుల తర్వాత భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ ఉద్రిక్తతల నడుమ నిలిచిపోయిన ఐపీఎల్ టోర్నీ వచ్చే వారం  తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read Also : Emergency Gadgets : యుద్ధం వంటి ఎమర్జెన్సీ సమయంలో భారతీయుల దగ్గర ఉండాల్సిన 5 ముఖ్యమైన గాడ్జెట్లు ఇవే..!

అయితే, వారం రోజుల సస్పెన్షన్ బీసీసీఐ అధికారికంగా ఎత్తివేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం.. మే 8న రాత్రి జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఐపీఎల్ కూడా రద్దు అయింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పరిస్థితి దృష్ట్యా టోర్నీని వారం పాటు వాయిదా వేసింది బీసీసీఐ.

ఎట్టకేలకు భారత్, పాక్ యుద్ధం ముగియడంతో అందరి దృష్టి ఐపీఎల్ మ్యాచ్‌లపైనే పడింది. ఐపీఎల్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అక్కడి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ 10.1 ఓవర్ల తర్వాత రద్దు అయింది.

ఇప్పుడు ఇక్కడి నుంచే ఆడిస్తారా? లేదా కొత్త మ్యాచ్ జరుగుతుందా అనేది స్పష్టంగా లేదు. బీసీసీఐకి ఇంకా 14 రోజుల సమయం అవసరం. కానీ, భారత్, పాక్ మధ్య వారం కన్నా తక్కువ సమయంలోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో మరింత సమయం కలిసివస్తుంది. ఈ టోర్నమెంట్ జూన్ 1 నాటికి ముగియవచ్చు. ఇప్పుడు డబుల్ హెడర్ మ్యాచ్‌లను పెంచే అవకాశం ఉంటుంది.

నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడిస్తారంటే? :
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లను ధర్మశాల నుంచి ఢిల్లీకి ప్రత్యేక వందే భారత్ రైలు ద్వారా బీసీసీఐ పిలిపించింది. ఇప్పుడు ఈ టోర్నీని రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో మళ్ళీ ప్రారంభించవచ్చు. అయితే, అన్ని సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. బీసీసీఐ దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరోవైపు.. PBKS, DC ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని సురక్షితంగా ఢిల్లీకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల్లో ఐపీఎల్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మిగిలిన మ్యాచ్ ల కోసం 3 స్టేడియాలు ఎంపిక :
అంతకుముందు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలను మిగిలిన టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు వేదికలుగా ఎంపిక చేసింది బీసీసీఐ. మూడు ప్లేఆఫ్‌లు, ఫైనల్‌తో సహా 16 ఆటలు మిగిలి ఉన్నాయి.

Read Also : IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్‌లపై బిగ్ అప్‌డేట్.. ఆ 3 స్టేడియాలు షార్ట్‌లిస్ట్..?! 

ఐపీఎల్ ప్లేఆఫ్స్ కోసం రేసు కూడా ఆసక్తిగా జరుగుతోంది. జట్ల మధ్య పోరాటం ఇంకా కొనసాగుతోంది. గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ఇద్దరికీ 16-16 పాయింట్లు ఉన్నాయి. పంజాబ్ కూడా 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.