IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్‌లపై బిగ్ అప్‌డేట్.. ఆ 3 స్టేడియాలు షార్ట్‌లిస్ట్..?!

IPL 2025 : మిగిలిన 16 ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ స్టేడియాలను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసినట్టు సమాచారం

IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్‌లపై బిగ్ అప్‌డేట్..  ఆ 3 స్టేడియాలు షార్ట్‌లిస్ట్..?!

IPL 2025

Updated On : May 10, 2025 / 5:08 PM IST

IPL 2025 : ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. మిగిలిన 16 ఐపీఎల్ మ్యాచ్‌‌ల నిర్వహణపై కీలక అప్‌‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే మూడు స్టేడియాలను బీసీసీఐ షార్ట్ లిస్టు చేసినట్టు సమచారం.

Read Also : Lava Agni 3 : వారెవ్వా.. డిస్కౌంట్ అదిరింది.. అతి చౌకైన ధరకే డ్యూయల్ స్క్రీన్ లావా అగ్ని 3 కొనేసుకోండి.. డోంట్ మిస్!

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ తిరిగి ప్రారంభం అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సస్పెన్షన్ తర్వాత మిగిలిన మ్యాచ్‌లకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) బెంగళూరు, చెన్నై హైదరాబాద్‌లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

భారత ప్రభుత్వం నుంచి ఐపీఎల్ టోర్నమెంట్ పునఃప్రారంభానికి అనుమతి లభిస్తే.. ఐపీఎల్ దక్షిణ భారత్‌‌లోని మూడు నగరాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని (ESPN)క్రిక్ఇన్ఫో నివేదించింది.

ఐపీఎల్ టోర్నీపై వారం రోజుల సస్పెన్షన్ :
గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఐపీఎల్ 2025ను వారం పాటు నిలిపివేసింది. అయితే, మే నెలలో ఐపీఎల్ తిరిగి నిర్వహించాలా వద్దా అని బీసీసీఐ కటాఫ్ తేదీని నిర్ణయించిందో లేదో ఇంకా ధృవీకరించలేదు.

మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌‌ల నిర్వహణ కోసం 3 వేదికల కోసం ముందస్తు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఉద్రికత్త పరిస్థితుల్లో ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించడం కష్టమేనని బీసీసీఐ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఫ్రాంచైజ్ అధికారులకు శుక్రవారం అనధికారికంగా దీనిపై సమాచారం అందింది. మిగిలిన ఐపీఎల్ సీజన్‌ను ఈ ఏడాది చివరిలో నిర్వహించవచ్చని పలువురు జట్టు అధికారులు సూచించారు.

మేలో ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభమైతే.. విదేశీ ఆటగాళ్లను తిరిగి రప్పించడం అతిపెద్ద సవాలుగా మారుతుంది. ఐపీఎల్ సస్పెన్షన్ తర్వాత జట్లు రద్దు అయ్యాయి. ప్లేయర్లు తమ గమ్యస్థానాలకు వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. చాలా మంది విదేశీ ఆటగాళ్ళు భారత్ విడిచి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

57 మ్యాచ్‌లు పూర్తి.. మిగిలిన  12 లీగ్ మ్యాచ్‌లు  :
ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ 57 మ్యాచ్‌లు జరిగాయి. 58వ మ్యాచ్ మే 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగింది. 10.1 ఓవర్ల తర్వాత ఆ మ్యాచ్ రద్దు అయింది. ఆ మ్యాచ్‌ను తిరిగి ఆడాలా వద్దా అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

Read Also : Jio Offers : జియో యూజర్లకు పండగే.. ఈ ప్లాన్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 200GB హైస్పీడ్ డేటా, ఫ్రీగా OTT బెనిఫిట్స్!

ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆపై 4 ప్లేఆఫ్‌లు ఉన్నాయి. మొదట్లో, హైదరాబాద్ వేదికగా ఫస్ట్ క్వాలిఫైయర్ ఎలిమినేటర్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కోల్‌కతా రెండో క్వాలిఫైయర్, ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.