Ashwini Kumar
Ashwini kumar: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య సోమవారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ఆ జట్టు.. కేకేఆర్ జట్టుపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 12.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులుచేసి ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది.
Also Read: HCA Vs SRH : మా పరువుకు భంగం కలిగించొద్దు, చర్చలకు సిద్ధం- ఎస్ఆర్ హెచ్ ఆరోపణలను ఖండించిన హెచ్ సీఏ
తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు..
ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో ఐపీఎల్ అరంగేట్రం బౌలర్ అశ్వని కుమార్ కీలక పాత్ర పోషించాడు. తన తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు సాధించిన మొదటి భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. కేకేఆర్ బ్యాటర్ రహానెను ఔట్ చేయడం ద్వారా తొలి వికెట్ పడగొట్టిన అశ్విని.. ఆ తరువాత ఒకే ఓవర్లో రింకు సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనీశ్ పాండేను ఔట్ చేశాడు. భారీ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆండ్రీ రస్సెల్ ఔట్ తరువాత నీతా అంబానీ, ఆకాశ్ అంబానీలు తమ చైర్స్ లో నుంచి లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు. నీతా అంబానీ ఫోర్స్ వికెట్స్ అంటూ చేతి వేళ్లు చూపుతూ అశ్వని కుమార్ బౌలింగ్ తీరుకు ఆశ్యర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎవరీ అశ్విని కుమార్..
అశ్వని కుమార్ మొహాలీలో జన్మించాడు. అతనికి 23ఏళ్లు. 2022 సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీ పంజాబ్ తరపున అరంగేట్రం చేసి నాలుగు మ్యాచ్ లు ఆడాడు. ఆ టోర్నీలో 5.85 ఎకానమీతో మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 4.03 ఎకానమీతో మూడు వికెట్లు తీశాడు. అయితే, గతేడాది జరిగిన షేర్-ఎ-పంజాబ్ టీ20 టోర్నమెంట్ లో రాణించి వార్తల్లో నిలిచాడు. తద్వారా ముంబయి మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డాడు. ఈ ఫాస్ట్ బౌలర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్.
Also Read: IPL 2025 : ఎట్టకేలకు ముంబై గెలుపు బోణీ.. కేకేఆర్ పై ఘన విజయం
గతేడాది అవకాశం దక్కలేదు..
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అశ్విని కుమార్ ను కొనుగోలు చేసింది. అయితే, ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్వని కుమార్ ను ముంబయి ప్రాంచైజీ రూ.30లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో మూడో మ్యాచ్ లోనే ఆడే అవకాశం దక్కింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తొలి మ్యాచ్ లోనే అద్భుత బౌలింగ్ తో నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ముంబై విజయంలో అశ్విని కుమార్ కీలక పాత్ర పోషించాడు.
ASHWANI KUMAR DISTURBING ANDRE RUSSELL’S TIMBERS ON DEBUT. 🥶pic.twitter.com/UIOvCb5gjP
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2025