IPL 2025 : ఎట్టకేలకు ముంబై గెలుపు బోణీ.. కేకేఆర్ పై ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16.2 ఓవర్లలోనే 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Courtesy BCCI
IPL 2025 : ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ లో గెలుపు బోణీ కొట్టింది. ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై గెలుపొందింది. 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16.2 ఓవర్లలోనే 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ అరంగ్రేటంలోనే అదరగొట్టాడు. బంతితో చెలరేగాడు. 4 వికెట్లు తీసి కేకేఆర్ వెన్ను విరిచాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, హార్ధిక్ పాండ్యా, విఘ్నేశ్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు. 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. ర్యాన్ రికెల్ టన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. కాగా, రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. స్వల్ప స్కోర్ కే(13) ఔటయ్యాడు.
Also Read : సీఎస్‌కేకు భారంగా మారాడా ? ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై సష్టత నిచ్చిన స్టీఫెన్ ఫ్లెమింగ్..
ఐపీఎల్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై.. ఈ సీజన్ లో పేలవ ప్రదర్శన కనబరిచింది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. దీంతో ముంబైపై ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు తన మూడో మ్యాచ్ లో ఎంఐ బోణీ కొట్టింది.