MS Dhoni : సీఎస్‌కేకు భారంగా మారాడా ? ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై సష్టత నిచ్చిన స్టీఫెన్ ఫ్లెమింగ్..
ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆరో స్థానం లోపు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నను సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు ఎదురవుతోంది.

pic credit @ ani
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మహేంద్రుడు 16 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. ధోని గనుక బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని పలువురు మాజీ ఆటగాళ్లతో పాటు కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో ఆదివారం రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఏడో స్థానంలో ఆడాడు. 11 బంతులను ఎదుర్కొన్న ధోని ఓ ఫోర్, ఓ సిక్స్ సాయంతో 16 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో ఔట్ అయ్యాడు. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. దీంతో ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆరో స్థానం లోపు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నను సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు ఎదురవుతోంది.
దీనికి చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమాధానం ఇచ్చాడు. మ్యాచ్‌లో ఆరు లేదా ఏడు ఓవర్లు మిగిలిన ఉన్న సమయంలో ధోని బ్యాటింగ్‌కు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశాడు. రెండేళ్ల క్రితం ధోని మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతడి ఫిట్‌నెస్ పై పూర్తి అవగాహన ఉందన్నాడు.
‘మైదానంలో అతడు చురుగ్గానే ఉన్నప్పటికి.. అతడు మోకాలు, శరీరం మునపటి స్థాయిలో లేవు. దీంతో అతడు బ్యాటింగ్‌లో 10 ఓవర్ల పాటు ఆడుతూ పరిగెత్తడం చాలా కష్టం అని.’ ఫ్లెమింగ్ చెప్పాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి ముందుకు వస్తాడన్నాడు. అలాగని సగం ఇన్నింగ్స్ ఉన్నప్పుడు క్రీజులోకి రాడని చెప్పాడు. అదే సమయంలో యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నాడు.
భారంగా మారాడా?
ఇక చెన్నైకి ధోని భారంగా మారాడా? అనే ప్రశ్నపై ఫ్లెమింగ్ స్పందించాడు. దీనిపై అసహనం వ్యక్తం చేశాడు. ధోని తమకు ఎంతో విలువైన ఆటగాడు అని గతేడాది కూడా చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు.
Riyan Parag : కెప్టెన్‌గా తొలి విజయం.. రియాన్ పరాగ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ..
కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ విషయంలో అతడు ఎంతో కీలకం. ఇలాంటి ఆటగాడిని తొమ్మిది లేదా పది ఓవర్లు ఆడించాలని అనుకోవడం లేదన్నాడు. అతడి ఫిట్‌నెస్ అందుకు సరిపోదన్నాడు. ఈ క్రమంలో 14 ఓవర్ల నుంచి బ్యాటింగ్‌కు వెళ్లేలా సన్నద్దం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉన్నవారిని బట్టి నిర్ణయాలు ఉంటాయన్నాడు.