Riyan Parag : కెప్టెన్‌గా తొలి విజయం.. రియాన్ పరాగ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ..
చెన్నై పై విజయం సాధించిన ఆనందంలో ఉన్న రియాన్ పరాగ్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన హోరాహోరీ పోరులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. సారథిగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో(ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్) ఓడిన రియాన్ పరాగ్‌కు.. కెప్టెన్‌గా ఇదే తొలి విజయం. దీంతో రియాన్ పరాగ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే.. ఆ ఆనందం ఎంతో సేపు అతడికి లేకుండా పోయింది. బీసీసీఐ అతడికి జరిమానా విధించింది. చెన్నైతో మ్యాచ్‌లో రాజస్థాన్ స్లో ఓవర్‌ను కొనసాగించడమే అందుకు కారణం. నిర్ణీత సమయంలో ఆర్ఆర్ జట్టు ఓవర్లను పూర్తి చేయడంలో విఫలమైంది. దీంతో ఆ జట్టు కెప్టెన్ అయిన పరాగ్‌కు బీసీసీఐ రూ.12 లక్షల ఫైన్ వేసింది.
Riyan Parag has been fined 12 Lakhs for the Slow Over-rate against Chennai Super Kings 🏆 pic.twitter.com/TRz1C1t6uU
— Johns. (@CricCrazyJohns) March 31, 2025
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ప్రస్తుత సీజన్‌లో పరాగ్ జట్టు చేసిన మొదటి నేరం కావడంతో పరాగ్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. కాగా.. శనివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాట్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేటును కొనసాగించడంతో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా పడిన సంగతి తెలిసిందే.
గతంలో ఓ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేటుకు పాల్పడితే.. సదరు జట్టు కెప్టెన్ పై ఓ మ్యాచ్ నిషేదాన్ని విధించేవారు. అయితే.. ప్రస్తుతం దీన్ని రద్దు చేశారు. నిషేదాన్ని ఎత్తివేసినప్పటికి ఫైన్‌తో నేరం తీవ్రతను బట్టి కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లను ఇవ్వనున్నారు.
Chennai Super Kings : ధోని ఔటైన తరువాత చెన్నై ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ వైరల్.. మీమ్స్ ఫెస్ట్..
చెన్నైతో మ్యాచ్‌లో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మహేశ్ పతిరణ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ సాధించారు.
అనంతరం రుతురాజ్ గైక్వాడ్ (63; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (32 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించనప్పటికి లక్ష్య ఛేదనలో సీఎస్ కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది.