Chennai Super Kings : ధోని ఔటైన తరువాత చెన్నై ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ వైరల్.. మీమ్స్ ఫెస్ట్..
ధోని ఔటైన తరువాత సీఎస్‌కే మహిళా అభిమాని ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

CSK Fangirl Reaction viral after Dhoni Dismissal in rr vs csk match Triggers Memes
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్‌లో అతడి కోసమో చెన్నై ఆడే మ్యాచ్‌లను చూసేందుకు ఆడియెన్స్ వస్తున్నారంటే అతి శయోక్తి కాదోమో. మహీ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే సమయంలో ధోని.. ధోనీ.. అంటూ ప్రేక్షకులు నినాదాలతో హోరెత్తిస్తుంటారు.
అతడు బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ధోని నామస్మరణతోనే గ్రౌండ్ మారుమోగిపోతుంటుంది. ఒకవేళ అతడు ఔటైతే స్టేడియం మొత్తంగా ఒక్కసారి నిశబ్దంగా మారిపోతుండడాన్నిచూస్తూనే ఉంటాం.
ఆదివారం చెన్నైసూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య గౌహతి వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 11 బంతులు ఎదుర్కొన్న ధోని ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టి 16 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మహేశ్ పతిరణ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ సాధించారు.
అనంతరం రుతురాజ్ గైక్వాడ్ (63; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (32 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించనప్పటికి లక్ష్య ఛేదనలో సీఎస్ కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది.
ఆఖరి ఓవర్‌లో ఔటైన ధోని…
చెన్నై విజయానికి ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం అయ్యాయి. స్ట్రైకింగ్‌లో ధోని ఉండడంతో సీఎస్‌కే విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ భావించారు. ఈ ఓవర్‌ను ఆర్ఆర్ బౌలర్ సందీప్ శర్మ వేశాడు. తొలి బంతి వైడ్ గా వేశాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 19గా మారింది. ఫస్ట్ బాల్ కు ధోని భారీ షాట్ కొట్టాడు. అయితే.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హెట్‌మయర్ పరిగెత్తుకుంటూ వచ్చి చక్కటి క్యాచ్‌ను అందుకున్నాడు.
Shimron Hetmeyer took a brilliant catch in the final over to dismiss MS Dhoni and potentially save the match for Rajasthan !! 👏👏#RRvCSK #RRvsCSK
— Cricketism (@MidnightMusinng) March 30, 2025
ధోని ఔట్ కావడంతో మైదానం ఒక్కసారిగా సెలెంట్ అయింది. కాగా.. ధోని ఔట్ కావడంతో ఓ సీఎస్‌కే మహిళా అభిమాని ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వాటితో సరదాగా పలు మీమ్స్‌లను క్రియేట్ చేస్తున్నారు.
Reaction of a Dhoni fan when Hetmyer took his catch!
Thala for a reason! 🔥 pic.twitter.com/0RmHT4kfcw
— Keh Ke Peheno (@coolfunnytshirt) March 31, 2025
When Hetmyer Took a catch of MS Dhoni
Samne hota to Socho kya hota 🤓#CSKvRR #CSKvsRR #RRvCSK
— ANKITA KUMARI (@ankitajkhs) March 31, 2025