MS Dhoni-Rahul Dravid : ‘ఇప్పుడెలా ఉంది నీకు.. అంతా బాగానే ఉందిగా..’ మ్యాచ్ ముగిసిన తరువాత రాహుల్ ద్రవిడ్‌తో ఎంఎస్ ధోని..
రాహుల్ ద్రవిడ్‌ను ధోని పరామర్శించాడు

Courtesy BCCI
ఆదివారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్ 6 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, రియాన్ పరాగ్ (37; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. సంజూ శాంసన్ (20) ఫర్వాలేదనిపించగా, యశస్వి జైస్వాల్ (4), ధ్రువ్ జురెల్ (3)లు విఫలం అయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మహేశ్ పతిరణ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ సాధించారు.
అనంతరం రుతురాజ్ గైక్వాడ్ (63; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ బాదగా, రవీంద్ర జడేజా (32 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడినప్పటికి లక్ష్య ఛేదనలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (0), విజయ్ శంకర్ (9), శివమ్ దూబె (18), ధోని (16) లు విఫలం అయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో వనిందు హసరంగ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మలు చెరో వికెట్ తీశారు.
ద్రవిడ్‌ను పరామర్శించిన ధోని..
రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యహరిస్తున్నాడు. అయితే.. ఐపీఎల్ 2025 సీజన్‌కు కొన్ని రోజుల ముందే అతడు గాయపడ్డాడు. అతడి కాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయినప్పటికి వీర్ ఛైర్, చేతి కర్రల సాయంతో మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు.
MS Dhoni with Rahul Dravid. ❤️🐐 pic.twitter.com/TzUce9pcyA
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 30, 2025
కాగా.. ఆర్‌ఆర్, సీఎస్‌కే మ్యాచ్ అనంతరం ధోని.. ద్రవిడ్ వద్దకు వెళ్లి అతడిని కౌగిలించుకున్నాడు. ద్రవిడ్ గాయంపై ఆరా తీశాడు. ఈ క్రమంలో వీరిద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో చూడడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ద్రవిడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా.. ద్రవిడ్, ధోని లు కలిసి చాలా కాలం పాటు టీమ్ఇండియాకు ఆడారు. వీరిద్దరు ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడిన సంగతి తెలిసిందే.
Ms dhoni Rahul Dravid to legends if indian cricket in one frame 💯🔥
— Viraj Rk17 (@VirajRk17) March 30, 2025
Great Sportsmanship by legend.
but what happened to Rahul dravid ?
— Dilip Jain ✨𝒟𝓙✨ (@dilipjain077) March 30, 2025
Legends supporting legends! The mutual respect is unmatched.
— Shashi kumar K R (@shashikumarkr25) March 30, 2025