RR vs CSK : వామ్మో రియాన్ పరాగ్.. కెప్టెన్ కావడంతో ఫీల్డింగ్ మారిపోయిందిగా.. సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

Courtesy BCCI
ఐపీఎల్‌లో 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, రియాన్ పరాగ్ (37; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మహేశ్ పతిరణ లు తలా రెండు వికెట్లు తీశారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం రుతురాజ్ గైక్వాడ్ (63; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ బాదగా, రవీంద్ర జడేజా (32 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడినప్పటికి లక్ష్య ఛేదనలో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో వనిందు హసరంగ నాలుగు వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మలు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
రియాన్ పరాగ్ సూపర్ క్యాచ్..
కాగా.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో అతడు ఫీట్ సాధించాడు. వనిందు హసరంగ బౌలింగ్‌లో సీఎస్‌కే విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబె తొలి రెండు బంతుల్లో ఫోర్, సిక్స్ బాది పది పరుగులు రాబట్టాడ్డు. మూడో బంతికి సైతం కవర్స్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రియాన్ పరాగ్.. తన కుడి చేతి ముందుకు చాచి డైవ్ చేస్తూ చక్కని క్యాచ్ అందుకున్నాడు.
MS Dhoni : ధోనికి షాక్.. సొంత అభిమానుల నుంచే రిటైర్‌మెంట్‌కు డిమాండ్..! ‘తలా’ ఇక చాలు..
RIYAN PARAG – ONE OF THE BEST CATCHES IN IPL EVER 👌 pic.twitter.com/hPm6S4tOgj
— Johns. (@CricCrazyJohns) March 30, 2025
ఖచ్చితంగా బంతి బౌండరీకి వెలుతుని భావించిన శివమ్ దూబె.. రియాన్ పరాగ్ ఫీల్డింగ్ విన్యాసాన్ని చూసి షాకైయ్యాడు. నిరాశగా పెవిలియన్ బాట పడ్డాడు. కాగా.. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్ అయ్యాక పరాగ్ ఫీల్డింగే మారిపోయిందని అంటున్నారు.