RR vs CSK : వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన చెన్నై.. దెబ్బకు రహానే, రాయుడులను గుర్తు చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్.. కీలక వ్యాఖ్యలు..
ఓపెనర్ల వైఫల్యంతో పాటు ఫీల్డింగ్‌లో తప్పిదాలు తమ విజయావకాశాలను దెబ్బతీశాయని సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.

pic credit@@mufaddal_vohra
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఆదివారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఓపెనర్ల వైఫల్యంతో పాటు ఫీల్డింగ్‌లో తప్పిదాలు తమ విజయావకాశాలను దెబ్బతీశాయని సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటర్లలో నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టాడు. రియాన్ పరాగ్ (37; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. అనంతరం లక్ష్య ఛేధనలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (63; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించాడు.
మ్యాచ్ అనంతరం సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ ఓటమిపై స్పందించాడు. మ్యాచ్‌లో పవర్ ప్లే ఎంతో కీలకమని చెప్పాడు. ఆర్ఆర్ బ్యాటర్ నితీశ్ రాణా చక్కటి బ్యాటింగ్ చేశాడని, అతడిని కట్టడి చేయలేకపోయామన్నాడు. ఇక ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా 8 నుంచి 10 పరుగులు అదనంగా ప్రత్యర్థికి ఇచ్చినట్లు చెప్పాడు. ఫీల్డింగ్ విషయంలో చాలా మెరుగు కావాల్సి ఉందన్నాడు.
ఈ పిచ్ పై 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చునని చెప్పాడు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తోందని.. 210 పరుగుల దిశగా వెలుతున్న ఆర్ఆర్ ను 180 పరుగులకే కట్టడి చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.
అప్పుడు రహానే, రాయుడు..
గతంలో అజింక్యా రహానే, అంబటి రాయుడు మిడిల్ ఆర్డర్‌లో బాధ్యతలను తీసుకుని చక్కగా ఆడేవారు. రహానే
3వ స్థానంలో బ్యాటింగ్ వస్తే.. రాయుడు మిడిల్ ఓవర్లలో ఆడేవాడు. ఇప్పుడు వారిద్దరు లేకపోవడంతో తాను వన్‌డౌన్‌లో రావడమే మంచిదని భావించి.. మూడో స్థానంలో బరిలోకి దిగుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
MS Dhoni : ధోనికి షాక్.. సొంత అభిమానుల నుంచే రిటైర్‌మెంట్‌కు డిమాండ్..! ‘తలా’ ఇక చాలు..
‘టాప్ ఆర్డర్‌లో రాహుల్ త్రిపాఠి దూకుడుగా ఆడగలడు. అయినా.. నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం పెద్ద సమస్యేం కాదు. ఎందుకంటే గత మూడు మ్యాచ్‌ల్లోనూ నేను ముందుగానే బ్యాటింగ్ వచ్చాను.’ అని రుతురాజ్ నవ్వుతూ చెప్పాడు. అతడు ఓపెనర్ల వైఫల్యం ఇన్‌డైరెక్టర్‌గా కామెంట్ చేశాడు.
తాను వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేయాలనే నిర్ణయాన్ని వేలం సమయంలో తీసుకున్నారని చెప్పాడు. ఆ స్థానంలో ఆడేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాను అనుకుంటే స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు రిస్క్ తీసుకుని బ్యాటింగ్ చేయగలనని చెప్పుకొచ్చాడు.
ఓపెనర్లు శుభారంభం అందించి ఉంటే.. ఆర్ఆర్ మ్యాచ్‌లో పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికి కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఎప్పటిలాగానే నూర్ అహ్మద్ చక్కగా బౌలింగ్ చేశాడు. ఖలీల్ అహ్మద్, జడేజా లు సైతం చక్కని ప్రదర్శన చేశారు. తమకు మూమెంటం అవసరం అని, ఒక్కసారి మూమెంటం వస్తే మాత్రం మమ్మల్ని ఆపడం చాలా కష్టం అని రుతురాజ్ చెప్పాడు.