Indian Express Power List 2025 : వామ్మో.. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా కంటే జైషా నే ప‌వ‌ర్‌ఫుల్‌..

ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అత్యంత శ‌క్తివంత‌మైన భార‌తీయుల జాబితాను విడుద‌ల చేసింది.

Indian Express Power List 2025 : వామ్మో.. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా కంటే జైషా నే ప‌వ‌ర్‌ఫుల్‌..

Jay Shah ranks ahead of Rohit Kohli Bumrah in list of Indian Express Power List 2025

Updated On : March 29, 2025 / 1:13 PM IST

ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అత్యంత శ‌క్తివంత‌మైన భార‌తీయుల జాబితాను విడుద‌ల చేసింది. ఇందులో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌తో పాటు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మ‌న్ జై షాలు చోటు ద‌క్కించుకున్నారు.

2025 సంవ్స‌రానికి గాను ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ రిలీజ్ చేసిన 100 మంది అత్యంత శ‌క్తివంతుల జాబితాలో క్రికెట్‌కు సంబంధించి ఈ చ‌తుష్ట‌యం చోటు సంపాదించారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఈ ముగ్గురు స్టార్ క్రికెట‌ర్ల కంటే జై షా మంచి ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో జై షా 24 స్థానంలో నిలిచాడు.

వేలంలో అన్‌సోల్డ్.. శార్దూల్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన జ‌హీర్ ఖాన్ ఫోన్ కాల్‌..

ఇక రోహిత్ శ‌ర్మ 48వ స్థానంలో, విరాట్ కోహ్లీ 72వ స్థానంలో, జ‌స్‌ప్రీత్ బుమ్రా 83వ స్థానం ద‌క్కించుకున్నారు. దీనిపై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పందించింది. ఈ న‌లుగురికి అభినంద‌లు తెలియ‌జేసింది.

CSK vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓట‌మి.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ వింత వ్యాఖ్య‌లు.. సంతోషంగా ఉంది..

ఇక భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉండ‌గా, రెండో స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిలిచారు.

ఐపీఎల్‌తో బిజీబిజీ..

ఇటీవ‌లే రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా లు ఐపీఎల్‌తో బిజీ బిజీగా ఉన్నారు. వీరిలో విరాట్ కోహ్లీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా, రోహిత్ శ‌ర్మ‌, బుమ్రాలు ముంబై ఇండియ‌న్స్ త‌రుపున ఆడుతున్నారు.

MS Dhoni : చెన్నై మ్యాచ్ ఓడిపోయినా.. చ‌రిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఒకే ఒక సీఎస్‌కే ఆట‌గాడు

కాగా.. రోహిత్ శ‌ర్మ, కోహ్లీలు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతుండ‌గా బుమ్రా ప్ర‌స్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. అత‌డు ఏప్రిల్ తొలి వారంలో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుతో క‌లిసే అవ‌కాశం ఉంది.