IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో మలైకా అరోరా.. ఆ దిగ్గజ క్రికెటర్ పక్కనే కూర్చొనీ మ్యాచ్ వీక్షించిన ముద్దుగుమ్మ.. డేటింగ్ అంటున్న నెటిజన్లు?
ఆదివారం చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించింది బాలీవుడ్ ముద్దు గుమ్మ మలైకా అరోరా.

Malaika Arora spotted at RRvsCSK match with Kumar Sangakkara dating rumours VIRAL
బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 50 పదులు దాటినా కూడా వన్నె తరగని అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ భామ తన వ్యక్తిగత విషయాలతో పాటు సోషల్ మీడియా హాట్ హాట్ ఫోటోలతో వార్తలతో నిలుస్తూ ఉంటుంది. భర్తతో విడిపోయిన అమ్మడు.. అప్పట్లో ఓ యువ హీరోతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగింది. అయితే.. కొన్నాళ్ల క్రితం వీరిద్దరికి బ్రేకప్ అంటూ వార్తలు వచ్చాయి.
తాజాగా అమ్మడు ఓ దిగ్గజ క్రికెటర్‌తో ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఆదివారం గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో అమ్మడు ప్రత్యక్షం కావడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరినట్లైంది.
Chennai Super Kings : ధోని ఔటైన తరువాత చెన్నై ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ వైరల్.. మీమ్స్ ఫెస్ట్..
కుమార సంగక్కరతో ప్రేమ..!
శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లలో కుమార సంగక్కర ఒకడు. ప్రస్తుతం ఈ దిగ్గజ క్రికెటర్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా.. గౌహతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో కుమార సంగక్కర పక్కన మలైకా అరోరా కూర్చొని మ్యాచ్‌ను వీక్షించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.
Malaika Arora with Kumar Sangakkara. pic.twitter.com/6ZGwGXqOFu
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 30, 2025
మలైకా అరోరా, కుమార్ సంగక్కరతో నిజంగా డేటింగ్ చేస్తుందో లేదో తెలియదు కానీ.. మలైకా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అదృష్ట ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన తరువాత ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం రుతురాజ్ గైక్వాడ్ (63; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించినప్పటికి లక్ష్య ఛేదనలో సీఎస్ కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది.
Malaika Arora, Sangakkara dating😳
— Rajat (@paanchatgoshti) March 30, 2025