IPL 2025 : వికెట్ తీసిన తరువాత పుష్ప స్టైల్ సెలబ్రేషన్స్.. మ్యాచ్ ముగిసిన తరువాత రీజన్ చెప్పిన హసరంగ..
చెన్నైతో మ్యాచ్‌లో వికెట్ తీసిన తరువాత హసరంగ పుష్ప స్టైల్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

Courtesy BCCI
ఆదివారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడంలో.. ఆర్ఆర్ ఆటగాడు వనిందు హసరంగ కీలక పాత్ర పోషించాడు. నాలుగు వికెట్లు తీసి సీఎస్‌కే పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో అతడు శివమ్ దూబే వికెట్ తీసిన తరువాత పుష్ప స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. పుష్ప స్టైల్‌లో సంబరాలు చేసుకోవడం పై మ్యాచ్ అనంతరం హసరంగ స్పందించాడు. తాను తెలుగు, తమిళం, మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తానని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో తన బౌలింగ్ శైలిలో పెద్దగా మార్పులు చేయలేదన్నాడు. ప్రాథమిక అంశాలకు లోబడి.. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతులు వేసినట్లుగా వివరించాడు. బ్యాటర్లు భారీ స్కోరు చేయడంతో బౌలర్ల పై ఒత్తడి తగ్గిందన్నాడు.
Riyan Parag : కెప్టెన్‌గా తొలి విజయం.. రియాన్ పరాగ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ..
Wanindu Hasaranga said, “I love to watch Telugu, Malayalam and Tamil movies. I got that celebration from the Pushpa film”. pic.twitter.com/PJcvmJEqM0
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 30, 2025
చెన్నై కెప్టెన్ రుతురాజ్ వికెట్ తీయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. అతడు విధ్వంసకర ఆటగాడని, మరికొంత సమయం గనుక అతడు క్రీజులో ఉండి ఉంటే.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకునేవాడని చెప్పాడు. ఇక ఆర్ఆర్ ఫీల్డర్లు అద్భుతంగా రాణించారని, దూబె, రుతురాజ్ ఇచ్చిన క్యాచ్‌లను చక్కగా ఒడిసి పట్టారన్నాడు.
దూబె ఔటైన తరువాత పుష్ప స్టైల్‌లో సంబురాలు చేసుకోవడం బాగుందన్నాడు. తాను మలయాళ, తమిళ, తెలుగు సినిమాలను ఎక్కువగా చూస్తుంటానని, మరీ ముఖ్యంగా పుష్ప సినిమా చాలా సార్లు చూడడంతో అలా చేశానన్నాడు.
ఇక ఆర్ఆర్‌కు మంచి బౌలింగ్ ఎటాక్ ఉందన్నాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో తాను, మహేశ్ తీక్షణ లు కలిసి ప్రత్యర్థులను కట్టడి చేయగలుగుతున్నామన్నాడు. అయితే.. వేరువేరు పాత్రలు పోషించాల్సి వస్తుందన్నాడు. కొన్ని సార్లు కొత్త బంతితో, మరికొన్ని సార్లు పాత బంతితో బౌలింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు.