Courtesy BCCI
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 4 వికెట్లతో చెలరేగాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో లసిత్ మలింగ రికార్డును బద్దలు కొట్టాడు.
ముంబై తరుపున 122 మ్యాచ్‌ల్లో లసిత్ మలింగ 170 వికెట్లు తీయగా 139 మ్యాచ్‌ల్లో అతడి రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. వీరిద్దరి తరువాత హర్భజన్ సింగ్, మిచెల్ మెక్‌క్లెనఘన్ లు ఉన్నారు.
MI vs LSG : నువ్వు కూడా సిక్స్ కొట్టావా.. పంత్ రియాక్షన్ వైరల్.. (వీడియో వైరల్)
𝟏𝟕𝟏* – 𝐇𝐈𝐆𝐇𝐄𝐒𝐓 𝐖𝐈𝐂𝐊𝐄𝐓-𝐓𝐀𝐊𝐄𝐑 𝐅𝐎𝐑 𝐌𝐈 𝐈𝐍 #𝐓𝐀𝐓𝐀𝐈𝐏𝐋 💥
Boom goes past Mali to 🔝 the wickets chart in Blue & Gold 💙✨@ril_foundation | #ESADay #EducationAndSportsForAll #MumbaiIndians #PlayLikeMumbai #MIvLSG pic.twitter.com/4LSGRw6ePi
— Mumbai Indians (@mipaltan) April 27, 2025
ఐపీఎల్‌లో 2013లో జస్‌ప్రీత్ బుమ్రా అరంగ్రేటం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతడు ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ముంబై ఐదు సార్లు టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు బుమ్రా ఐపీఎల్‌లో 139 మ్యాచ్‌లు ఆడాడు. 7.30 ఎకానమీతో 174 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల ప్రదర్శన రెండు సార్లు చేశాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 5/10.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..
జస్‌ప్రీత్ బుమ్రా – 174 వికెట్లు
లసిత్ మలింగ – 170 వికెట్లు
హర్భజన్ సింగ్ – 127 వికెట్లు
మిచెల్ మెక్‌క్లెనఘన్ – 71 వికెట్లు
కీరాన్ పొలార్డ్ – 69 వికెట్లు
హార్దిక్ పాండ్యా – 65 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించింది. ర్యాన్ రికెల్టన్ (58; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (54; 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదగా.. ఆఖరిలో నవన్ ధీర్ (25 నాటౌట్; 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. ప్రిన్స్ యాదవ్, దిగ్వేత్ రతి, రవిబిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
DC vs RCB : ఢిల్లీపై విజయం తరువాత కోహ్లీ కీలక వ్యాఖ్యలు..
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో ఆయుష్ బదోని (35), మిచెల్ మార్ష్ (34)లు ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ రిషబ్ పంత్ (4), ఆయు బదోని (2)లు విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లతో లక్నోపతనాన్ని శాసించగా మూడు వికెట్లతో ట్రెంట్ బౌల్ట్ చెలరేగాడు. విల్ జాక్స్ రెండు, కార్బిన్ బాష్ ఓ వికెట్ సాధించాడు.