MI vs LSG : నువ్వు కూడా సిక్స్ కొట్టావా.. పంత్ రియాక్షన్ వైరల్.. (వీడియో వైరల్)
రిషబ్ పంత్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rishabh Pant couldn't believe the Ravi Bishnoi six Vs Jasprit Bumrah
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆలస్యంగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 58), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54)హాఫ్ సెంచరీలు చేశారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రిన్స్ యాదవ్, దిగ్వేత్ రతి, రవిబిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
DC vs RCB : ఢిల్లీపై విజయం తరువాత కోహ్లీ కీలక వ్యాఖ్యలు.. టీ20 క్రికెట్ అంటే..
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో ఆయుష్ బదోని (35), మిచెల్ మార్ష్ (34)లు ఫర్వాలేదనిపించారు. మిగిలిన వారంతా విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు పడగొట్టాడు. విల్ జాక్స్ రెండు, కార్బిన్ బాష్ ఓ వికెట్ సాధించాడు.
రవిబిష్ణోయ్ సిక్స్ కొట్టగానే..
కాగా.. ఈ మ్యాచ్‌లో రవిబిష్ణోయ్ సిక్స్ కొట్టగానే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అందరిని తెగ నవ్విస్తోంది.
సాధారణంగా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనడం హేమాహేమీ బ్యాటర్లకు కూడా కష్టమే. పైగా అతడు నాలుగు వికెట్లు తీసి ఊపు మీదున్నప్పుడు అతడిని ఆపడం సాధ్యం అయ్యే పనికాదు. అయితే.. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన స్పెల్‌లోని చివరి బంతిని వేయగా లక్నో లెగ్‌స్పిన్నర్ అయిన రవి బిష్ణోయ్ లాంగ్ ఆన్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు.
Rishabh Pant reaction after bishnoi hit bumrah for a six .
😭😭😭#RCBvsDC #MIvsLSG pic.twitter.com/iqJAnPMTIq— JosD92 (@J0SD92) April 27, 2025
DC vs RCB : బెంగళూరు పై అందుకే ఓడిపోయాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కామెంట్స్.. లేదంటేనా?
సిక్స్ కొట్టిన తరువాత తాను ఏదో హాఫ్ సెంచరీ లేదా మ్యాచ్‌ను గెలిపించినట్లుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో లక్నో డగౌట్‌లోని ఆటగాళ్లు తెగ నవ్వేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ అయితే.. ఏందిరా నువ్వు కూడా సిక్స్ కొట్టావా.. ఆ సెలబ్రేషన్స్ ఏందీ.. అన్నట్లుగా సైగ చేశాడు. అతడి పక్కనే ఉన్న మెంటార్ జహీర్ ఖాన్ సైతం నవ్వుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.