Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని..

మరి ధోని రాకతో అయినా సీఎస్ కే భవితవ్యం మారుతుందేమో చూడాలి.

Courtesy BCCI

Dhoni : ఎంఎస్ ధోని మళ్లీ కెప్టెన్ అయ్యాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సీఎస్ కే ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయం బారినపడటంతో ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నారు. దీంతో ఈ సీజన్ మొత్తానికి ధోని సారధ్యం వహిస్తాడని సీఎస్ కే కోచ్ ఫ్లెమింగ్ ప్రకటించారు.

ఈ సీజన్ లో చెన్నై ప్రదర్శన పేలవంగా ఉంది. పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. ఈ సీజన్ లో 5 మ్యాచులు ఆడిన చెన్నై.. నాలుగింటిలో ఓటమిపాలైంది. మరి ధోని రాకతో అయినా సీఎస్ కే భవితవ్యం మారుతుందేమో చూడాలి. ధోని కెప్టెన్సీపై ఫ్యాన్స్ అనేక ఆశలు పెట్టుకున్నారు. జట్టు గెలుపుబాట పడుతుందని ఆశిస్తున్నారు.

Also Read : 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. 6 జట్లు.. 90 మంది ప్లేయ‌ర్స్‌..

2023లో చివరిసారిగా ధోని కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు. అయితే గాయం కారణంగా రుతురాజ్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు ధోనికి దక్కాయి. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ కు ముందు సీఎస్ కే కోచ్ ఫ్లెమింగ్ ఈ విషయాన్ని ప్రకటించాడు.

ఎడమ మోచేయి దగ్గర కారణంగా రుతురాజ్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడని, అతడి స్థానంలో ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తాడని ఫ్లెమింగ్ చెప్పాడు. మార్చి 30న రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. ఈ సీజన్ లో గైక్వాడ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఐదు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదాడు.

Also Read : 180 ఫ్ల‌స్ ల‌క్ష్య‌మా.. అబ్బే మా వ‌ల్ల కాదు.. గ‌త కొన్నేళ్లుగా చెన్నైది ఇదే క‌థ‌.. రైనా ఎంత ప‌ని చేసావ‌య్యా..

సీజన్ మధ్యలో ధోని జట్టు కెప్టెన్ పగ్గాలు తీసుకోవడం ఇదేమి తొలిసారి కాదు. ఐపీఎల్ 2022లోనూ ఇలానే జరిగింది. ఆ సీజన్ లో చెన్నై ప్రదర్శన పేలవంగా ఉంది. లీగ్ స్టేజ్ తొలి అర్థ భాగంలో అన్ని మ్యాచులు ఓడింది. దీంతో జడేజాను కెప్టెన్ గా తప్పించి ఆ బాధ్యతలు ధోనికి ఇచ్చారు. ఈ సీజన్ లోనూ సీఎస్ కే ప్రదర్శన పేలవంగా ఉంది.

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన చెన్నై ఈ సీజన్ లో వరుసగా ఓటమి పాలవుతోంది. పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో ఉంది. ధోని కెప్టెన్సీలో సీఎస్ కే ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. 2010, 2011, 2018, 2021, 2023లో టైటిల్ నెగ్గింది. ధోని సారధ్యంలోనే రెండు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు గెలుచుకుంది.