Olympics Cricket : 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్.. 6 జట్లు.. 90 మంది ప్లేయర్స్..
లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఎన్ని జట్లు పాల్గొంటాయి ? ఏ ఫార్మాట్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు ? అన్న ప్రశ్నలకు జవాబులు దొరికాయి.

Los Angeles 2028 Olympics Cricket to feature 6 teams 90 players
లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చిన సంగతి తెలిసిందే. 128 సంవత్సరాల తరువాత క్రికెట్‌కు చోటు దక్కడంతో ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ఎన్ని జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటాయి ? ఏ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు ? అన్న ప్రశ్నలకు సమాధానాలు వచ్చేశాయి.
టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్ల చొప్పున పాల్గొననున్నాయన్నారు. ఒక్కొ జట్టు నుంచి 15 మంది చొప్పున మొత్తం 90 క్రికెటర్లకు అనుమతి ఇచ్చారు. కాగా.. ఆతిథ్య దేశమైన అమెరికాకు డైరెక్ట్ ఎంట్రీ దక్కే ఛాన్స్ ఉంది.
మిగిలిన జట్లను ఎలా ఎంపిక చేస్తారు అన్నది ఇంకా నిర్ణయించలేదు. వన్డేలు, టెస్టులను చాలా తక్కువ దేశాలు ఆడుతున్నప్పటికి టీ20 ఫార్మాట్‌లో క్రికెట్‌ను దాదాపు 100 దేశాలు ఆడుతున్నాయని, వీటిలోంచి జట్లను ఎంపిక చేయడం సవాల్‌తో కూడుకున్నదని నిర్వాహకులు వెల్లడించారు.
క్రికెట్‌తో పాటు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, లాక్రోస్ వంటి క్రీడలకు అవకాశం కల్పించారు.
1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ ను తొలిసారి నిర్వహించారు. అదే చివరిసారి కూడా అయింది. అప్పుడు బ్రిటన్, ఫ్యాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రిటన్ విజయం సాధించింది.
ర్యాంకింగ్స్ ఆధారంగా..?
టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను ఒలింపిక్స్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది. అదే జరిగితే.. టాప్-5లో ఉన్న జట్లకు మాత్రమే అవకాశం ఉంది. ఆతిథ్య హోదాలో అమెరికా ఎలాగూ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన ఐదు స్థానాల కోసం ర్యాంకింగ్స్‌లో ఉన్న జట్లు పోటీపడొచ్చు. ప్రస్తుతం పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ లు ఉన్నాయి. అయితే.. ఒలింపిక్స్‌కు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈలోగా ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటుచేసుకోవచ్చు.