WI-W vs SC-W : నడవలేని స్థితిలో స్ట్రెచర్ పై వెళ్లి.. తిరిగొచ్చి సెంచరీ.. నీ పోరాట స్ఫూర్తికి సలామ్..
ఓ వైపు గాయం బాధిస్తున్నా కూడా జట్టు కోసం పట్టుదలతో పోరాడే ఆటగాళ్లను చాలా అరుదుగా చూస్తుంటాం.

Hayley Matthews stretchered off returns to hit hundred in WWC qualifier
క్రికెట్ ఆడేటప్పుడు ప్లేయర్లకు గాయాలు కావడం సహజం. అయితే.. ఓ వైపు గాయం బాధిస్తున్నా కూడా జట్టు కోసం పట్టుదలతో పోరాడే ఆటగాళ్లను చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ నడవలేని స్థితిలో స్ట్రెచర్ పై వెళ్లిన ఆమె.. జట్టు కష్టాల్లో ఉండడంతో మళ్లీ తిరిగొచ్చి సెంచరీ చేసింది. ఆమె పోరాట స్ఫూర్తి ఎందరో మనసులను గెలుచుకుంది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం స్కాట్లాండ్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సాట్కాండ్ 45 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్టిండీస్ జట్టు 245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. కెప్టెన్ హేలీ (114 నాటౌట్; 113 బంతుల్లో 14 ఫోర్లు) అద్భుతంగా పోరాడింది. ఆమెకు జైడా జేమ్స్(45) సహకారం అందించినా చివరికి నిరాశే మిగిలింది. 46.2 ఓవర్లలో విండీస్ 233 పరుగులకు కుప్పకూలింది. దీంతో సాట్కాండ్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది.
స్ట్రెచర్ పై వెళ్లి..
ఓపెనర్‌గా బరిలోకి దిగిన హేలీ తనదైన శైలిలో షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఓ వైపు ఆమె పోరాటం చేస్తుంటే.. మరోవైపు వికెట్ల పతనం వేగంగా సాగింది. ఈ క్రమంలో 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హేలీకి కాళ్లు పట్టేశాయి. వెంటనే మైదానాన్ని వీడింది. ప్రాథమిక చికిత్స తీసుకుని తిరిగి వచ్చి పోరాటాన్ని కొనసాగించింది. అయితే.. 99 పరుగుల వద్దకు చేరుకున్న తరువాత బ్యాటింగ్ చేయలేకపోయింది. ఈ సారి నడవలేకపోవడంతో ఆమెను స్ట్రైచర్ పై మైదానం బయటకు తీసుకువెళ్లడం గమనార్హం.
hayley matthews you are insane absolutely insane! retired hurt but came back for the wi after the middle order collapse even after not being able to walk from that stretcher and scored that hundred and has the 4-fer too today! i love women. pic.twitter.com/ZDcIDTKx4e
— kay ☆ (@mandhanamp4) April 9, 2025
కొద్దిసేపటికే 9వ వికెట్ పడడంతో.. అంత ఇబ్బంది పడుతూ కూడా ఆమె తిరిగి మైదానంలోకి అడుగుపెట్టింది. శతకాన్ని అందుకోవడమే కాదు పదో వికెట్‌కు ఆలియా అలీన్ (17)తో కలిసి 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే.. ఆలియా ఎల్బీగా ఔట్ కావడంతో హేలీ పోరాటానికి ఫలితం దక్కలేదు.