MI vs SRH ( Photo Credit : IPL (X)
సన్‌రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ సీజన్‌లో ముంబైకు ఇది మూడో విజయం కాగా.. సన్‌రైజర్స్‌కు ఇది ఐదో ఓటమి.
163 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (31; 23 బంతుల్లో 5 ఫోర్లు), విల్ జాక్స్ (36; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (26; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (26; 16 బంతుల్లో 3 సిక్సర్లు) లు రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లో పాట్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఓ వికెట్ సాధించాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (40; 28 బంతుల్లో 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (37; 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, పాండ్యాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.