Credit BCCI
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు అద్భుత ఆటతీరుతో విజయం సాధించింది. ముంబై బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లు బౌండరీల మోతమోగించారు. ఇద్దరు ఆఫ్ సెంచరీలతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. శివమ్ దూబె (50), రవీంద్ర జడేజా (53నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చెన్నై జట్టు 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో ముంబై జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ రికిల్ బట్ (24) త్వరగా ఔట్ కాగా.. రోహిత్ శర్మ (76 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (68నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా అద్భుత బ్యాటింగ్ తో ముంబై జట్టును గెలిపించారు. రోహిత్, సూర్య సూపర్ బ్యాటింగ్ తో 15.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ముంబై జట్టు 177 పరుగులు చేసి విజయం సాధించింది. ఇక, మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం తరువాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మేము ముందుగానే ఊహించాం. చెన్నై జట్టు మెరుగైన స్కోర్ చేస్తుందని భావించాం. అయితే, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే నాకు ఎంతో ఉపశమనం కలిగించింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ గురించి వ్యాఖ్యాత ప్రశ్నించగా.. రోహిత్ శర్మ ఫామ్ గురించి మేమెప్పుడూ ఆందోళన చెందలేదు. ఎందుకంటే.. రోహిత్ బాగా ఆడినరోజు ప్రత్యర్థి జట్టు ఓటమి ఖాయమవుతుంది. ఆ విషయం మాకు బాగా తెలుసు అంటూ హార్దిక్ పాండ్యా బదులిచ్చారు. సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసిన విధానం చాలాబాగుంది. రోహిత్, సూర్య భాగస్వామ్యం ముంబై విజయానికి కారణమైందని హార్దిక్ పాండ్యా అన్నారు.
Hardik Pandya said “You don’t have to worry about Rohit Sharma’s form, when he comes back to form, the opposition will be out of the game”. pic.twitter.com/4a5EjhGJhI
— Johns. (@CricCrazyJohns) April 20, 2025