ఐపీఎల్ 2025లో జట్టు కూర్పు విషయంలో ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్ఘానిస్థాన్ బౌలర్ ఘజన్‌ఫర్ స్థానంలో అదే దేశానికి చెందిన స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను తీసుకుంది.
ఘజన్‌ఫర్‌కు గాయం కావడంతో అతడు ఐపీఎల్ 2025కు దూరమైన విషయం తెలిసిందే. వెన్ను నొప్పి తగ్గకపోవడంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ ఆడడం లేదు.
మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్‌ఫర్‌ను రూ.4.8 కోట్ల ధరకు కొనుగోలు చేయడం గమనార్హం. ఐపీఎల్ 2025లో ఘజన్‌ఫర్ గాయం కారణంగా కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా దూరమవుతున్నాడు.
Mujeeb Ur Rahman
అతడి స్థానంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్‌తో ముంబై ఇండియన్స్ రూ.2 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ముజీబ్‌కు ఐపీఎల్ ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. గతంలో 19 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 19 వికెట్లు తీశాడు.
Also Read: 10 వేల జాబ్స్‌కి ఈ రోజే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేయండి..
ముజీబ్ ఐపిఎల్‌లో ఇప్పటివరకు 4 సీజన్లు ఆడాడు. 2018లో అతని తొలి సీజన్లో అతను 11 మ్యాచులు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. 2021 సీజన్ నుంచి ఒక్క ఆట కూడా ఆడలేదు. ముజీబ్‌ను బేస్ ప్రైస్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసినట్లు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తాజాగా తెలిపింది.
ముజీబ్‌కు టీ20ల్లో రాణించిన అనుభవం ఉంది. పవర్‌ప్లేలో అతడికి స్పిన్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చెమటలు పట్టించే సత్తా ఉంది. అయినప్పటికీ త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి మాత్రం ముజీబ్ ఎంపిక కాలేకపోయాడు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్స్ గా నిలిచారు.