RRB Recruitment: 10 వేల జాబ్స్‌కి ఈ రోజే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేయండి..
మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6తో ముగియాల్సి ఉండగా, దాన్ని పొడిగించారు.

RRB Recruitment
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్ (ఆర్‌ఆర్‌బీ) మినిస్ట్రియల్, ఐసొలేటెడ్ కేటగిరీల్లో 1,036 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగియనుంది.
సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీసు (సీఎన్) 07/2024 కింద చేస్తున్న ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికీ దరఖాస్తు చేయని అభ్యర్థులు rrbapply.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6తో ముగియాల్సి ఉండగా, ఫిబ్రవరి 16కి పొడిగించారు. ఫీజు పేమెంట్‌ను ఈ నెల 18వరకు చేసుకోవచ్చు. కాగా, ఫిబ్రవరి 19న దరఖాస్తు ఫామ్‌ల కరెక్షన్ కోసం విండో అందుబాటు ఉంటుందని, ఫిబ్రవరి 28న క్లోజ్ అవుతుందని ఆర్ఆర్‌బీ తెలిపింది.
ఏయే పోస్టులు, జీతం ఎంత?
కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని మూడు సంవత్సరాలు సడలించారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో మరింత సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము
పీడబ్ల్యూబీడీ, మహిళలు, లింగమార్పిడి, మాజీ సైనికుల అభ్యర్థులు, ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ వర్గాలు/ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.250. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ.500. అర్హత, ఎంపిక ప్రక్రియ, మరిన్ని వివరాల కోసం rrbapply.gov.in చూడొచ్చు.