సంచలనం.. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇచ్చే రూ.182 కోట్ల నిధులను రద్దు చేసిన ఎలాన్ మస్క్‌.. బీజేపీ రియాక్షన్

భారత్‌లో ఓటర్ల సంఖ్య పెరగడానికి రూ.182 కోట్ల నిధులు ఇవ్వాలనుకోవడం ఏంటని అమిత్‌ మాలవీయ ప్రశ్నించారు.

సంచలనం.. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇచ్చే రూ.182 కోట్ల నిధులను రద్దు చేసిన ఎలాన్ మస్క్‌.. బీజేపీ రియాక్షన్

Updated On : February 16, 2025 / 4:32 PM IST

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE-డోజ్‌) శాఖ చీఫ్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో ఓట్ల శాతం పెరిగేలా చేయడానికి ఉద్దేశించిన రూ.182 కోట్ల నిధుల మంజూరును డోజ్‌ రద్దు చేసింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తమ గవర్నమెంట్‌ వ్యవస్థలో వృథా వ్యయాన్ని కట్టడి చేసేందుకే ఆయన డోజ్ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పలు దేశాలకు అందించే నిధులకు కోత విధించారు.

Also Read: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా దీపాదాస్‌ను తప్పించడంతో రిలాక్స్‌ అవుతున్నదెవరు?

ఇండియాలో ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరిగేలా చేసేందుకు నిధులను రద్దు చేసినట్లు డోజ్‌ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. డోజ్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ నేత అమిత్‌ మాలవీయ దీనిపై ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

భారత్‌లో ఓటర్ల సంఖ్య పెరగడానికి రూ.182 కోట్ల నిధులు ఇవ్వాలనుకోవడం ఏంటని అమిత్‌ మాలవీయ ప్రశ్నించారు. దేశ ఎన్నికల ప్రక్రియలో ఇది భాగం కాదని, అయినప్పటికీ దీని నుంచి లాభం పొందుతున్నది ఎవరని నిలదీశారు. బీజేపీ మాత్రం కాదని పేర్కొన్నారు.

భారత్‌కే కాకుండా ఇంకే ఏయే దేశాల నిధుల్లో కోత?

  • బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు ఇచ్చే $29 మిలియన్ల కోత
  • ఆసియాలో లర్నింట్‌ ఔట్‌కమ్స్‌ మెరుగుపరచడానికి ఇచ్చే $47 మిలియన్ల కోత
  • లింగ సమానత్వం, మహిళా సాధికారత కేంద్రం కోసం ఇచ్చే $40 మిలియన్లు కోత
  • ప్రేగ్ సివిల్ సొసైటీ సెంటర్‌కు ఇచ్చే $32 మిలియన్లు కోత
  • మోల్డోవాలో సమ్మిళిత, భాగస్వామ్య రాజకీయ ప్రక్రియను పెంపొందించడానికి ఇచ్చే $22 మిలియన్లు కోత
  • నేపాల్‌లో ఆర్థిక సమాఖ్యవాదం కోసం ఇచ్చే $20 మిలియన్లు కోత
  • నేపాల్‌లో జీవవైవిధ్య పరిరక్షణ కోసం ఇచ్చే $19 మిలియన్లు కోత
  • మాలిలో సామాజిక సమన్వయం కోసం ఇచ్చే $14 మిలియన్లు కోత
  • సెర్బియాలో ప్రజా సేకరణను మెరుగుపరచడం కోసం ఇచ్చే $14 మిలియన్లు కోత
  • కంబోడియా యువత అభివృద్ధి కోంచే ఇచ్చే $9.7 మిలియన్లు కోత
  • దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్యం కోసం ఇచ్చే $2.5 మిలియన్లు కోత
  • కంబోడియాలో స్వతంత్ర గళాన్ని బలోపేతం చేయడానికి చ్చే $2.3 మిలియన్లు కోత
  • లైబీరియాలో ఓటరు నమ్మకం కోసం ఇచ్చే $1.5 మిలియన్లు కోత