IPL 2025 : ఉత్కంఠపోరులో ముంబైదే గెలుపు.. ఎంఐ ముందుకు, గుజరాత్ ఇంటికి..

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

Courtesy BCCI @IPL

IPL 2025: ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలిచింది. 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ.. 20 ఓవర్లలో 208 పరుగులకే పరిమితమైంది. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ చివరి వరకు పోరాడింది. ఒకానొక సమయంలో గెలుపు దిశగా పయనించిన గుజరాత్.. సాయి సుదర్శన్ ఔట్ తో సీన్ మొత్తం మారిపోయింది.

సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో చెలరేగినా ప్రయోజనం లేకపోయింది. సాయి సుదర్శన్ 49 బంతుల్లోనే 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లో 48 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔట్ కావడంతో జీటీకి ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. బుమ్రా, రిచర్డ్, సాంట్నర్, అశ్వని కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్ లో ఓటమితో జీటీ ఇంటి బాట పట్టింది. మరోవైపు క్వాలిఫయర్ 2కు ముంబై అర్హత సాధించింది. జూన్ 1న పంజాబ్స్ కింగ్స్ తో తలపడనుంది.

స్కోర్లు..
ముంబై ఇండియన్స్ – 20 ఓవర్లలో 228/5
గుజరాత్ టైటాన్స్ – 20 ఓవర్లలో 208/6

Also Read: RCB : ఐపీఎల్ 2025 ఫైన‌ల్‌కు ముందు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు కొత్త టెన్ష‌న్‌.. మ‌రోసారి అదే జ‌రిగితే క‌ప్పు గోవిందా?