Credit BCCI
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు.
Also Read: Women World Cup: విశాఖ వేదికగా ఉమెన్ వరల్డ్ కప్ పోటీలు, ఐపీఎల్ మ్యాచులు- కేశినేని చిన్ని
తొలుత పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేయగా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులే చేయగలిగింది. ప్రభ్ సిమ్రాన్ (33), శశాంక్ సింగ్ (31 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టుకు ఓపెనర్ విరాట్ కోహ్లీ (73నాటౌట్) వెన్నెముకగా నిలవగా.. ధనాధన్ ఇన్నింగ్స్ తో పడిక్కల్ (61) ఆ జట్టు విజయాన్ని తేలిక చేశాడు. ఛేదనలో దిట్ట అయిన కోహ్లీ ముచ్చటైన షాట్లతో అలరించాడు. మరోవైపు పడిక్కల్ మరింత దాటిగా ఆడాడు. ఫోర్లు, సిక్స్ లతో వేగంగా పరుగులు రాబట్టాడు. ఇక కోహ్లీ మాత్రం లక్ష్యం అందుబాటులోనే ఉండటంతో అవసరానికి తగినట్లు ఆడాడు.
Also Read: IPL 2025: ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ.. చెన్నైపై ముంబై ఘన విజయం, MI హ్యాట్రిక్ విక్టరీ
గత మ్యాచ్ లో ఆర్సీబీ జట్టును వారి సొంతగడ్డపై ఓడించాక పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. అయితే, ఆదివారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై విజయం సాధించిన తరువాత కోహ్లీ సైతం కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. ఆర్సీబీ విజయం తరువాత శ్రేయాస్ వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. బదులుగా శ్రేయాస్ తలాడిస్తూ కోహ్లీవైపు రాగా.. కోహ్లీ నవ్వుతూ అతడితో కరచాలనం చేశాడు. అయితే, కోహ్లీ సంబరాలతో శ్రేయాస్ అయ్యర్ కాస్త నొచ్చుకున్నట్టే కనిపించింది. దీంతో కోహ్లీ, శ్రేయాస్ మధ్య కాస్త ఘాటుగానే సంభాషణ జరిగింది.
ఆ తరువాత కోహ్లీ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాళ్లను నవ్వుతూ పలుకరించుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
– RCB beat CSK in Chennai. ✅
– RCB beat MI in Mumbai. ✅
– RCB beat KKR in Kolkata. ✅
– RCB beat RR in Jaipur. ✅
– RCB beat PBKS in Mullanpur. ✅RCB HAVE WON 5/5 AWAY FROM HOME – THE CAPTAIN PATIDAR ERA. 🥶 pic.twitter.com/47uJglIE3U
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 20, 2025
ఇదిలాఉంటే.. ఈ ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్ లు గెలిచి.. మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఓడిపోయిన మూడు మ్యాచ్ లు తమ సొంతగ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కావటం గమనార్హం. గెలిచిన అన్ని మ్యాచ్ లో బయట వేదికల్లోనే.
చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై
ముంబైలో ముంబై ఇండియన్స్ జట్టుపై
కోల్ కతాలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై
జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ పై
ముల్లన్పూర్ లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆర్సీబీ విజయం సాధించింది.