IPL 2025: ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ.. చెన్నైపై ముంబై ఘన విజయం, MI హ్యాట్రిక్ విక్టరీ
9 వికెట్ల తేడాతో సీఎస్ కే ని చిత్తు చేసింది ముంబై.

Courtesy BCCI
IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఘన విజయం సాధించింది. 177 పరుగుల టార్గెట్ ను కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 9 వికెట్ల తేడాతో సీఎస్ కే ని చిత్తు చేసింది ముంబై. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఈ సీజన్ లో పెద్దగా రాణించని రోహిత్ శర్మ.. ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. చెన్నైపై హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 45 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 30 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. 5 సిక్సులు, 6 ఫోర్లు బాదాడు. వీరిద్దరూ చెలరేగడంతో 177 పరుగుల టార్గెట్ ను ముంబై అలవోకగా ఛేజ్ చేసింది.
Also Read: వైభవ్ సూర్యవంశీ మాత్రమే కాదు.. ఈ ఆరుగురు చిచ్చరపిడుగులు కూడా అప్పట్లో ఇంత చిన్న వయసులోనే.. వామ్మో..
ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా మూడో విజయం. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన ముంబై నాలుగు మ్యాచుల్లో గెలిచింది, నాలుగు మ్యాచుల్లో ఓడింది. తాజా గెలుపుతో పాయింట్ల టేబుల్ లో ముంబై 6వ స్థానంలో ఉంది.
అటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ లో మరో పరాజయం ఎదురైంది. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన సీఎస్ కే ఆరు మ్యాచుల్లో ఓడింది. వరుస ఓటములతో పాయింట్ల టేబుల్ లో అట్టడుగు స్థానంలో ఉంది చెన్నై.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here