Courtesy BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో సీఎస్కేని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్కే.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులే చేసింది. కెప్టెన్ రుతురాజ్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఓటమిని తప్పించలేకపోయాడు. రుతురాజ్ 44 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో రవీంద్ర జడేజా (32) రాణించాడు. రాజస్థాన్ జట్టులో నితీశ్ రాణా సంచలన బ్యాటింగ్ చేశాడు. పరుగుల వరద పారించాడు. 36 బంతుల్లోనే 81 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.
Also Read : మళ్లీ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. రెండో ఓటమి బాధలో కెప్టెన్ కమిన్స్ ఏమన్నాడంటే?
ఈ సీజన్ లో చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి. గత మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో సీఎస్కే ఓటమి పాలైంది. అటు ఈ సీజన్ లో రాజస్థాన్ కు ఇదే తొలి విజయం. గత రెండు మ్యాచుల్లో రాజస్తాన్ ఓటమిపాలైంది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో రాజస్థాన్ జట్టు ఓటమిపాలైంది.