IPL 2025 Revised Schedule: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ ఈ నెల 17 నుంచి పున: ప్రారంభం కానుంది. ఐపీఎల్ రీ షెడ్యూల్ ను యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు లీగ్ మ్యాచులు జరుగుతాయి. ఈ నెల 17న ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి.
ఆరు స్టేడియాలలో మిగిలిన 17 మ్యాచులు నిర్వహిస్తామంది. మే 29న క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. బెంగళూరు, జైపూర్, పుణె, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వేదికగా లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి.
Also Read: విరాట్ రిటైర్.. నెక్ట్స్ ఏంటి? ఈ ఐదుగురిలో టెస్టుల్లోకి వచ్చేదెవరు?