IPL 2025: అంపైర్‌తో వాగ్వివాదం సమయంలో అడ్డొచ్చాడని.. అభిషేక్ శర్మ వద్దకెళ్లి గిల్ ఏం చేశాడో చూశారా.. వీడియో వైరల్

అభిషేక్ శర్మ వారిస్తున్నా శుభమన్ గిల్ పట్టించుకోలేదు. దీంతో అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఆ తరువాత గిల్ అభిషేక్ శర్మ వద్దకు వెళ్లి..

Credit BCCI

IPL 2025 Shubman Gill vs Abhishek Sharma: ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ (SRH), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. 225 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Also Read: IPL 2025: పాపం గిల్.. సెంచరీ చేయకుండా కావాలనే అడ్డుకున్నారా..? అతను ఔట్ కదా.. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్

హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ 41బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. అయితే, ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ప్రసిద్ కృష్ణ వేసిన యార్కర్ అభిషేక్ శర్మ బూట్లను తాకింది. దీంతో బౌలర్ ఔట్ అంటూ అంపైర్ ను అపీల్ చేశాడు. ఆ తరువాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ డీఆర్ఎస్ కోరాడు. కానీ, డీఆర్ఎస్ సమీక్షలో ఔట్ కాదని తేల్చారు. దీంతో గిల్ అంపైర్ వద్దకు వచ్చి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్, గిల్ మధ్య వాదోపవాదనలు జరుగుతున్న సమయంలో వారి వద్దకు అభిషేశ్ శర్మ వచ్చి గిల్ ను వారించే ప్రయత్నం చేశాడు.


అభిషేక్ శర్మ వారిస్తున్నా శుభమన్ గిల్ పట్టించుకోలేదు. దీంతో అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయి తన టీం మెడికల్ సిబ్బందితో కాలు బూటువిప్పి బాల్ తగిలిన ప్రాంతంలో తాత్కాలిక చికిత్స చేయించుకున్నాడు. అంపైర్ తో వాగ్వివాదం తరువాత శుభమన్ గిల్ అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో అభిషేక్ శర్మ వద్దకు వచ్చి సరదాగా తన కాలుతో అభిషేక్ కాలును తన్నే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.