IPL 2025: పాపం గిల్.. సెంచరీ చేయకుండా కావాలనే అడ్డుకున్నారా..? అతను ఔట్ కాదా.. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్

హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శుభ్‌మాన్ గిల్ బ్యాట్ తో అదరగొట్టాడు. కేవలం 38 బంతుల్లో 76 పరుగులు చేశాడు.

IPL 2025: పాపం గిల్.. సెంచరీ చేయకుండా కావాలనే అడ్డుకున్నారా..? అతను ఔట్ కాదా.. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్

Credit BCCI

Updated On : May 3, 2025 / 8:04 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ సన్ రైజర్స్ (SRH), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శుభ్‌మాన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. 225 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 38 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది.

Also Read: IPL 2025: అయ్యో వైభవ్.. కాస్త ఓపిక పట్టాల్సింది.. రాహుల్ ద్రవిడ్ రియాక్షన్ వైరల్.. రోహిత్ శర్మ ఏం చేశాడంటే..

ఈ మ్యాచ్ లో శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్ లో అదరగొట్టాడు. కేవలం 38 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో పది ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. 76 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అయితే, గిల్ ఔట్ వివాదాస్పదంగా మారింది. దీంతో గిల్ అంపైర్ తో తీవ్ర వాగ్వివాదానికి దిగాడు. చివరికి చేసేదేమీలేక నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు.

 

గుజరాత్ ఇన్నింగ్స్ లో శుభ్‌మాన్ గిల్ రనౌట్ వివాదాస్పదమైంది. హర్షల్ పటేల్ విసిరిన త్రోను ఎస్ఆర్ హెచ్ కీపర్ క్లాసెన్ అందుకునే ప్రయత్నం చేశాడు. బంతి గ్లవ్స్ ను తాకి స్టంప్ నకు పక్కగా వెళ్లింది. అదేసమయంలో అతడి గ్లవ్ స్టంప్ ను తాకడంతో బెయిల్స్ లేచాయి. థర్డ్ అంపైర్ చాలాసేపు రీప్లేను పరిశీలించాడు. చివరికి గిల్ ఔట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో గిల్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

 

వాస్తవానికి.. బంతి క్లాసెన్ చేతిలో ఉండగా గ్లవ్ స్టంప్ ను కొట్టినట్లు స్పష్టత లేదు. అయినా థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మైదానంలోని అంపైర్ తో వాగ్వివాదంకు దిగాడు. అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్ అతణ్ని శాంతపరిచి పెవిలియన్ వైపు పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన గిల్ ఫ్యాన్స్.. ‘‘గిల్ ను సెంచరీ చేయకుండా అంపైర్ కావాలనే అడ్డుకున్నాడు’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.