IPL 2025: అయ్యో వైభవ్.. కాస్త ఓపిక పట్టాల్సింది.. రాహుల్ ద్రవిడ్ రియాక్షన్ వైరల్.. రోహిత్ శర్మ ఏం చేశాడంటే..

గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన 14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ... ముంబైతో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయ్యాడు.

IPL 2025: అయ్యో వైభవ్.. కాస్త ఓపిక పట్టాల్సింది.. రాహుల్ ద్రవిడ్ రియాక్షన్ వైరల్.. రోహిత్ శర్మ ఏం చేశాడంటే..

Credit BCCI

Updated On : May 2, 2025 / 7:34 AM IST

Vaibhav Suryavanshi and Rahul Dravid: ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ ముంబై జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదదర్శించింది. ఫలితంగా 100 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది.

Also Read: IPL 2025: గాల్లోనే ఇలాఎలా బ్రో.. ఐపీఎల్ చరిత్రలో అద్భుతమైన క్యాచ్.. ఈ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

తొలుత ముంబై జట్టు బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (53), రికిల్టన్ (61) దూకుడుగా ఆడారు. దీంతో తొలి వికెట్ కు 116 పరుగులు చేశారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (48 నాటౌట్), హార్దిక్ పాండ్యా (48నాటౌట్) దూకుడుగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో ముంబై జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు మొదటి నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. కొద్దిసేపటికే యశస్వీ జైస్వాల్, నితీశ్ రాణా ఇలా అందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. చివరిలో అర్చర్ మాత్రమే 30 పరుగులు చేశాడు. దీంతో 16.1 ఓవర్లలో 117 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్ అయింది.


వైభవ్ డకౌట్.. రాహుల్ రియాక్షన్ వైరల్..
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ తో వీరవిహారం చేశాడు. ఫలితంగా 38 బంతుల్లో 101 పరుగులు చేసి సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. దీంతో ముంబైతో జరిగే మ్యాచ్ లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీవైపు ఉన్నాయి. వైభవ్ ఈ మ్యాచ్ లో ఎలా ఆడతాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, వైభవ్ క్రీజులోకి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టారు. దీంతో వైభవ్ బ్యాటింగ్ కోసం ఎదరుచూసిన ప్రతిఒక్కరూ నిరాశపడ్డారు. రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా నిరాశ చెందినట్లు కనిపించింది. అయ్యే వైభవ్ కాస్త ఓపిగ్గా ఆడాల్సింది అన్నట్లుగా రాహుల్ హావభావాలు కనిపించాయి. వైభవ్ సైతం నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. అయితే, రోహిత్ శర్మ వైభవ్ సూర్యవంశీ భుజంపై తడుతూ అభినందించడం కనిపించింది.