IPL 2025: గాల్లోనే ఇలాఎలా బ్రో.. ఐపీఎల్ చరిత్రలో అద్భుతమైన క్యాచ్.. ఈ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ అద్భుత క్యాచ్ తో అందరినీ ఆశ్చర్య పర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Credit BCCI
IPL 2025 CSK vs PBKS: ఐపీఎల్ 2025 లో భాగంగా బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ -18 ప్లే ఆఫ్స్ రేసు హోరాహోరీగా సాగుతున్న వేళ పంజాబ్ కింగ్స్ కీలక విజయం సాధించింది. ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో చెన్నైని దాని సొంతగడ్డపై ఓడించింది.
KKR : కోచ్ చంద్రకాంత్ పండిట్‌పై కోల్‌కతా స్టార్ ప్లేయర్ అసంతృప్తి.. భోజనం విషయంలో గొడవ!
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. సామ్ కరన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. తొమ్మిది ఫోర్లు, ఆరు సిక్సులతో కేవలం 47 బంతుల్లో 88 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించాడు. వీరిద్దరు మినహా చెన్నై జట్టులో ఎవరూ పెద్దగా పరుగులు రాబట్టలేక పోయారు. మహేంద్ర సింగ్ ధోనీ నాలుగు బంతుల్లో 11 పరుగులు కొట్టి ఔట్ అయ్యాడు. చివరిలో యుజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్ తో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో చెన్నై జట్టు 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది.
191 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ జట్టులో ప్రభ్ సిమ్రాన్ సింగ్ (ఇంపాక్ట్ ప్లేయర్) 36బంతుల్లో 54 పరుగులు చేయగా.. శ్రేయాస్ అయ్యర్ 41 బంతుల్లో 72 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ (23) రాణించడంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజేతగా నిలిచింది. అయితే, సీఎస్కే ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ అద్భుత క్యాచ్ ఈ మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది.
Also Read: KKR : గెలుపు జోష్‌లో ఉన్న కోల్‌కతాకు బిగ్ షాక్.. కెప్టెన్ రహానేకు గాయం.. ఇప్పుడెలా ఉందంటే?
పంజాబ్ కింగ్స్ జట్టు 180 పరుగుల వద్ద 18వ ఓవర్ ను రవీంద్ర జడేజా బౌలింగ్ వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతికి పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ భారీ షాట్ కొట్టాడు. అయితే, బౌండరీ లైన్ వద్ద ఉన్న డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతం చేశాడు. బౌండరీ లైన్ బయట పడుతున్న బంతిని గాల్లోకి ఎగిరి బ్రెవిస్ క్యాచ్ అందుకున్నాడు. అప్పటికే అతను బౌండరీ లైన్ అవతల గాల్లో ఉండటంతో బంతిని బయటకు విసిరాడు. రెండుసార్లు బౌండరీ లైన్ దాటి మరీ బంతిని గాల్లోకి ఎగురవేస్తూ అద్భుత రీతిలో డెవాల్డ్ బ్రెవిస్ క్యాచ్ ను ఒడిసిపట్టాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. బ్రెవిస్ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్.. ఇలా కూడా క్యాచ్ పట్టొచ్చా.. ఐపీఎల్ చరిత్రలో ఇదో అద్బుతమైన క్యాచ్ అంటూ బ్రెవిస్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
DEWALD BREVIS TOOK ONE OF THE BEST CATCHES OF IPL 2025. 🤯pic.twitter.com/E4vxW9IiEX
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2025