KKR : కోచ్ చంద్రకాంత్ పండిట్‌పై కోల్‌కతా స్టార్ ప్లేయర్ అసంతృప్తి.. భోజనం విషయంలో గొడవ!
ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ పాత్రపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.

KKR Star Unhappy With Coach Chandrakant Pandit Over Objection On Dining With Rival Player Report
డిపెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2025 సీజన్‌లో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ జట్టు ఖాతాలో 9 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +0.271గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. గత సీజన్‌లో గౌతమ్ గంభీర్ మెంటార్ ఉన్నప్పుడు జట్టుకు ఉన్న థ్రిల్ ఇప్పుడు లేదని జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా తెలిపాడు. అతడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నాడు.
దీంతో ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ పాత్రపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. చాలా మంది ఆటగాళ్లతో అతడు వ్యహరించే తీరు సరిగ్గా లేదని అంటున్నారు. RevSportz నివేదిక ప్రకారం.. కేకేఆర్ టీమ్‌లోని విదేశీ ఆటగాడు తన ప్రత్యర్థి జట్టుకు చెందిన ఆటగాడితో భోజనం చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అతడితో కోచ్ చంద్రకాంత్ పండిట్ గొడవ పడినట్లు తెలుస్తోంది. కాగా..ఇక్కడ పండిట్ మరిచిపోయిన విషయం ఏంటంటే.. సదరు విదేశీ ఆటగాళ్లు ఇద్దరూ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే దేశం తరుపున ఆడుతున్న సహచర ఆటగాళ్లు అన్న సంగతి.
KKR : గెలుపు జోష్‌లో ఉన్న కోల్‌కతాకు బిగ్ షాక్.. కెప్టెన్ రహానేకు గాయం.. ఇప్పుడెలా ఉందంటే?
గౌతమ్ గౌంభీర్ టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా వెళ్లాలనే నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అతడితో పాటు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌ను సైతం తీసుకువెళ్లాడు. దీంతో కేకేఆర్ కోచింగ్ బృందంలో మార్పులు చోటు చేసుకున్నాయి. నాయర్‌ను జాతీయ జట్టు నుంచి తొలగించిన వెంటనే కేకేఆర్ అతడిని తమ బృందంలో చేర్చుకుంది. అతడు కేకేఆర్‌కు తిరిగి వచ్చినప్పటి నుంచి ఆటగాళ్లతో సన్నిహితంగా ఉంటూ పని చేస్తున్నాడు.
గతేడాది కేకేఆర్ ఐపీఎల్ టైటిల్‌ను అందుకున్న తరువాత చాలా మంది ఆటగాళ్లు గంభీర్, నాయర్ పట్ల తమ అభిమానాన్ని బహిరంగంగా వెల్లడించారు. ఆటగాళ్ల పట్ల ఈ ఇద్దరు ఉన్న తీరు, వారు ఇచ్చిన మద్దతును ప్రశంసించారు. కానీ కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను పై పెద్దగా మాట్లాడలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చంద్రకాంత్ పాత్రపై ప్రశ్నలను లేవనెత్తుతుంది.
గంభీర్ కాకుండా మరే ఇతర కోచ్ లేదా మెంటార్ కోల్‌కతాకు విజయాలను అందించలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా సోమవారం విలేకరుల సమావేశంలో హర్షిత్ రాణా కూడా చెప్పాడు.
‘మా సపోర్ట్ స్టాప్ గత సీజన్‌లాగే బలంగా ఉంది. అందరూ చక్కగా పని చేస్తున్నారు. అయితే.. గంభీర్ లోని లోటు కనిపిస్తోంది. టీమ్‌ను ఒక్కటిగా నడిపించే అతడి స్ట్రైల్ అద్భుతం. ఆ థ్రిల్ ఫ్యాక్టర్‌ను నేను కొంచెం మిస్ అవుతున్నాను. నేను ఇంకెవరి గురించి మాట్లాడడం లేదు.’ అని హర్షిత్ రాణా అన్నాడు. గంభీర్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉందన్నాడు.