ఐపీఎల్ 2025 విజేతగా ఎవరు నిలుస్తారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఏ టీమ్ ఎలా ఆడుతుందో.. మైదానంలో ఏ బ్యాటర్ ఎటువంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడతాడో ఎవరికీ తెలియదు. ఐపీఎల్ 2025 వేళ చాలా మంది విజేత ఎవరు అంటూ ఏఐను ప్రశ్నిస్తున్నారు.
దీంతో గ్రోక్ ఎలాంటి ఆన్సర్ ఇస్తోందో తెలుసా? “ఐపీఎల్ విజేతను అంచనా వేయడం సాధారణంగా సాధ్యంకాదు. ఎందుకంటే విజయం అనేది జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల ఫామ్, వారికి అయ్యే ఇంజ్యూరీలు, సీజన్‌లో వారు పాటించే వ్యూహాల వంటి అనేక అంశాలపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నమెంట్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
ఇంకా ఎటువంటి మ్యాచ్‌లు జరగలేదు. దీంతో ఎవరు గెలుస్తారన్న విషయంపై కచ్చితంగా చెప్పలేం. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లను గెలుచుకుంది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లతో బలమైన జట్టుగా ముంబై ఉంది. ఇంతవరకు సీఎస్కే కూడా ఐదు టైటిళ్లు గెలుచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా గట్టి పోటీనిస్తుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్ వంటి ఆటగాళ్లతో బలమైన జట్టుగా ఉంది. 2024లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోనూ అభిషేక్ శర్మ, పాట్ కమ్మిన్స్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు కూడా ఐపీఎల్ మెగా వేలం తర్వాత వారి జట్టు కూర్పుల్లో మార్పులు చేసుకున్నాయి.
మొదట ముంబై, ఆ తరువాత హైదరాబాద్ జట్లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం ఉన్న అంచనాలు మాత్రమే. ఆట ముందుకు సాగుతున్న కొద్దీ మార్పులు జరిగాయి. ఐపీఎల్‌ను ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పడం కష్టం. పది జట్లలో ఏదైనా ఓ జట్టు కోల్‌కతాలో జరిగే మ్యాచులో ట్రోఫీని గెలుచుకోగలదు” అని చెప్పింది.