IPL 2025: ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకునే నాలుగు జట్లు ఇవే.. మాజీ క్రికెటర్ల అంచనా.. 2 దిగ్గజ టీమ్‌లకు షాక్
గత సీజన్‌లో ప్లేఆఫ్‌లకు ఎమ్‌ఐ, ఎల్ఎస్‌జీ, పీబీకేఎస్ వంటి జట్లు చేరలేదన్న విషయం తెలిసిందే.

IPL 2025 captains
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకునే జట్లు ఏవని మీరు అనుకుంటున్నారు?
ఇదే ప్రశ్నకు పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తూ కొన్ని జట్ల పేర్లను చెప్పారు. సాధారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అంచనాలు బాగా ఉంటాయి. అయితే, ఆ రెండు జట్లు ఈ సారి ప్లే ఆఫ్‌కు చేరబోవని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశారు.
Also Read: కొత్తగా మూడు రూల్స్ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే?
వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సారి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్‌లకు చేరుకుంటాయని చెప్పారు. గత సీజన్‌లో ప్లేఆఫ్‌లకు ఎమ్‌ఐ, ఎల్ఎస్‌జీ, పీబీకేఎస్ వంటి జట్లు చేరలేదన్న విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్పందిస్తూ.. పీబీకేఎస్, ఎమ్‌ఐ, ఎస్‌ఆర్‌హెచ్, జీటీ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయని అన్నారు.
దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ షాన్ పొల్లాక్ స్పందిస్తూ.. ఎమ్‌ఐ, సీఎస్కే, ఎస్‌ఆర్‌హెచ్, పీబీకేఎస్ ప్లేఆఫ్స్ దశకు చేరుకుంటాయని అంచనా వేశారు.
న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ స్పందిస్తూ.. సీఎస్కే, కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్, పీబీకేఎస్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయని అంచనా వేశారు.
రోహన్ గవాస్కర్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, డీసీ, ఎమ్‌ఐ ప్లేఆఫ్‌లకు అర్హత సాధిస్తాయని అంచనా వేశారు.
హర్ష భోగ్లే స్పందిస్తూ.. ఎస్‌ఆర్‌హెచ్, ఎమ్‌ఐ, కేకేఆర్, ఆర్సీబీ జట్లు ఆ అర్హత సాధిస్తాయని చెప్పారు.