IPL 2026 Auction 40 percent of the auction money gets only 5 players (Pic credit ITG)
IPL 2026 Auction : దుబాయ్‌లోని అబుదాబి వేదికగా మంగళవారం ఐపీఎల్ 2026 మినీ వేలం జరిగింది. మొత్తం 369 మంది ఆటగాళ్లు వేలంలోకి రాగా 77 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. అమ్ముడుపోయిన ఆటగాళల్లో 48 మంది భారత ప్లేయర్లు కాగా 29 మంది విదేశీ ఆటగాళ్లు. మొత్తం 10 ఫ్రాంఛైజీలు కలిపి 215.45 కోట్లు ఖర్చు చేశాయి. అయితే.. ఇందులో దాదాపు 40 శాతం ఐదుగురు ఆటగాళ్ల కోసమే ఖర్చు చేయడం గమనార్హం.
వారు ఎవరో ఓ సారి చూద్దాం..
కామెరాన్ గ్రీన్‌కు రూ.25.20 కోట్లు..
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కామెరూన్ గ్రీన్ నిలిచాడు. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ 25.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా గ్రీన్ చరిత్ర సృష్టించాడు. గతంలో 2023 వేలంలో గ్రీన్ 17.50 కోట్లకు అమ్ముడుపోయాడు.
AUS vs ENG 3rd Test : శతకంతో చెలరేగిన అలెక్స్ క్యారీ.. తొలి రోజు ఆసీస్‌దే..
మతిషా పతిరానకు 18 కోట్లు..
ఈ వేలంలో కేకేఆర్ గ్రీన్ తరువాత రెండో అత్యధిక బిడ్ వేసింది శ్రీలంక యువ పేసర్ మతిషా పతిరానా కోసమే. అతడిని 18 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే కేకేఆర్ ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసమే 43.20 కోట్లను ఖర్చు చేసింది.
Presenting the Top 5⃣ buys of #TATAIPLAuction 2026 🙌
Which was your favourite bid? 🔨#TATAIPL pic.twitter.com/cBeFFZ9FKp
— IndianPremierLeague (@IPL) December 16, 2025
ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల కోసం భారీ మొత్తం ఖర్చు చేసిన చెన్నై..
అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను ఒక్కొక్కరికి 14.20 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. అంటే ఈ ఇద్దరి కోసమే సీఎస్కే 28.40 కోట్లను ఖర్చు చేసింది.
లివింగ్ స్టోన్ కోసం సన్‌రైజర్స్..
ఈ వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్ మొదటి రౌండ్‌లో అమ్ముడుపోలేదు. అయితే వేలం తిరిగి ప్రారంభమైనప్పుడు అతని అదృష్టం మారిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని 13 కోట్లకు కొనుగోలు చేసింది.
Prithvi Shaw : పృథ్వీ షాను కొన్నారోచ్చ్.. ఒకప్పుడు 8 కోట్లు.. ఇప్పుడు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్..
మొత్తంగా ఈ ఐదుగురు ఆటగాళ్ల కోసమే ఫ్రాంఛైజీలు దాదాపు 40 శాతం (84.6 కోట్లు) ఖర్చు చేశాయి.