×
Ad

IPL 2026 Auction : మినీ వేలంలో అమ్ముడుపోయిన తొలి ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్.. పృథ్వీ షాను ఎవ్వ‌రూ కొన‌లే

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL 2026 Auction ) అబుదాబి వేదిక‌గా ప్రారంభమైంది.

IPL 2026 Auction David Miller sold to DelhiCapitals

IPL 2026 Auction : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలం అబుదాబి వేదిక‌గా ప్రారంభమైంది. జ‌ట్ల అభ్య‌ర్థ‌న‌ల మేర‌కు చివ‌రి నిమిషంలో కొత్త‌గా 19 ఆట‌గాళ్ల‌ను వేలం ప్ర‌క్రియ‌లోకి చేర్చారు. దీంతో వేలంలో పాల్గొనే ఆట‌గాళ్ల సంఖ్య 369కి చేరింది. మొత్తం 10 ఫ్రాంఛైజీలు క‌లిపి 77 మంది ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది.

వేలంలో తొలి ఆట‌గాడిగా ఆస్ట్రేలియా ఆట‌గాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ వ‌చ్చాడు. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వ‌చ్చిన అత‌డిని ఎవ్వ‌రూ కొనుగోలు చేయ‌లేదు.

ఇక రెండో ఆట‌గాడిగా ద‌క్షిణాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ వ‌చ్చాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని అదే ధ‌ర వ‌ద్ద ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొనుగోలు చేసింది.

ఇక మూడో ఆట‌గాడి పృథ్వీ షా వ‌చ్చాడు. రూ.75 లక్ష‌ల బేస్ ప్రైజ్‌తో వ‌చ్చిన అత‌డిని ఎవ్వ‌రూ కొనుగోలు చేయ‌లేదు.