IPL 2026 auction Matheesha Pathirana Sold To KKR
IPL 2026 auction : అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలం ఆసక్తికరంగా సాగుతోంది. తాము కోరుకున్న ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ను రూ.25.20 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకోగా.. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది.
ఇక శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరానాకు భారీ మొత్తం దక్కింది. అతడిని 18 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది.
Choose your ending: yorker, slower one, or wicket.😎🌪 https://t.co/BX55TchUte pic.twitter.com/649l4xDw76
— KolkataKnightRiders (@KKRiders) December 16, 2025
IPL 2026 Auction : కోహ్లీ టీమ్‌లోకి వెంకటేష్ అయ్యర్.. హోరాహోరీగా పోటీపడిన కేకేఆర్, ఆర్‌సీబీ
2 కోట్ల కనీస ధరతో వేలంలోకి అడుగుపెట్టిన అతడి కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఈ యార్కర్ల కింగ్‌ను దక్కించుకునేందుకు ఆరంభంలో లక్నో, ఢిల్లీ లు పోటీపడ్డాయి. ఆతరువాత కోల్‌కతా వచ్చి చేరింది. చివరికి కేకేఆర్ అతడిని 18 కోట్లకు సొంతం చేసుకుంది.