IPL 2026 Auction to be held around 13 to 15th December 2025
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తోంది. 2008లో మొదలైన ఈ లీగ్ ఇప్పటి వరకు విజయవంతంగా 18 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక 19వ సీజన్ కోసం రంగం సిద్ధమవుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ కన్నా ముందు మినీ వేలాన్ని (IPL 2026 Auction) నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. ఈ వేలాన్ని డిసెంబర్ 13 నుంచి 15వ తేదీల్లో నిర్వహించనున్నారని తెలుస్తోంది.
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ప్లేయర్లను నవంబరు 15లోపు రిటైన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. ఆ తరువాత తమ దగ్గర ఉన్న ఆటగాళ్లు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, వదిలేస్తున్న ఆటగాళ్ల వివరాలను బీసీసీఐకి ఫ్రాంఛైజీలు సమర్పించాల్సిన ఉంటుందని క్రిక్ బజ్ తెలిపింది. వేలం నిర్వహించే తేదీలను ఇంకా అధికారికంగా ఖరారు చేయకపోయినప్పటికి కూడా డిసెంబర్ 13 నుంచి 15 తేదీల్లో వేలాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించింది.
అన్ని ఫ్రాంఛైజీలతో ఈ విషయం గురించి చర్చించిన తరువాత అధికారికంగా వేలం తేదీని వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ వేలాన్ని విదేశాల్లో నిర్వహిస్తారా? లేదంటే భారతదేశంలో నిర్వహిస్తారా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంది.
🚨 IPL AUCTION UPDATE. 🚨
– Auction to be held around 13-15th December.
– 15th November set to be the deadline to finalise retention. (Cricbuzz). pic.twitter.com/hL9f4PYu1a
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2025
2023లో దుబాయ్, 2024లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ వేలాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
చెన్నై, రాజస్థాన్‌లలో భారీ మార్పులు..
మిగిలిన జట్లలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికి కూడా చెన్నై, రాజస్థాన్ జట్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కరన్ వంటి ఆటగాళ్లను సీఎస్కే వదిలివేయాలని భావిస్తుందట. అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో సీఎస్‌కే పర్స్‌లో 9.75 కోట్లు జమ కానున్నాయి.
Jasprit Bumrah : జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. భారత క్రికెట్ చరిత్రలోనే ఏకైక పేసర్..
అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి కెప్టెన్ సంజూ శాంసన్ తప్పుకోనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే లంక స్పిన్నర్లు వనిందు హసరంగా, మహీష్ తీక్షణలు కూడా వేలంలోకి రావొచ్చునని అంటున్నారు.