×
Ad

KKR : కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్‌గా దిశాంత్ యాగ్నిక్‌..

ఐపీఎల్ 2026కి ముందు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు (KKR) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

IPL 2026 Kolkata Knight Riders appoint Dishant Yagnik as fielding coach

KKR : ఐపీఎల్ 2026కి ముందు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు ఫీల్డింగ్ కోచ్‌గా దిశాంత్ యాగ్నిక్‌ను నియ‌మించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కేకేఆర్ జ‌ట్టు వెల్ల‌డించింది.

వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అయిన యాగ్నిక్ దేశ‌వాళీలో రాజ‌స్థాన్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అత‌డు 2011 నుంచి 2014 మ‌ధ్య ఐపీఎల్‌లో 25 మ్యాచ్‌లు ఆడాడు. ఆట‌కు వీడ్కోలు ప‌లికిన‌ప్ప‌టి నుంచి అత‌డు ఫీల్డింగ్ కోచ్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించాడు.

ICC ODI Rankings : ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌.. టాప్ ర్యాంక్ కోల్పోయిన కోహ్లీ.. నంబ‌ర్ 1 బ్యాట‌ర్‌గా కివీస్ ఆట‌గాడు..

కొన్ని సీజ‌న్ల పాటు రాజ‌స్థాన్ కు ఫీల్డింగ్ కోచ్‌గా ప‌ని చేశాడు. గ‌త సీజ‌న్‌లో నిరాశ‌ప‌రిచే సీజ‌న్ త‌రువాత రాయ‌ల్స్‌.. యాగ్నిక్‌తో విడిపోయింది.

SL vs ENG : ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు శ్రీలంక జ‌ట్టు ఇదే.. కెప్టెన్‌గా చ‌రిత్ అస‌లంక‌..

కేకేఆర్ ప్రధాన కోచ్‌గా అభిషేక్ నాయర్ నేతృత్వంలోని పునరుద్ధరించబడిన బ్యాక్‌రూమ్ గ్రూపులో యాగ్నిక్ చేరాడు. డ్వేన్ బ్రావో మెంటర్‌గా, షేన్ వాట్సన్ అసిస్టెంట్ కోచ్‌గా, టిమ్ సౌథీ బౌలింగ్ కోచ్‌గా, ఆండ్రీ రస్సెల్ కొత్తగా సృష్టించబడిన పవర్ కోచ్ పాత్రను చేపట్టారు.