IPL 2026 : ఫిల్ సాల్ట్ కళ్లుచెదిరే క్యాచ్.. ఏంది భయ్యా అలా పట్టేశావ్.. బాబోయ్.. మెంటలెక్కించాడు! వీడియో వైరల్

IPL 2026 : చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకున్న తీరు మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది.

Phil salt Catch

  • ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్
  • గాల్లో తేలుతూ కళ్లుచెదిరే క్యాచ్ పట్టిన ఫిల్ సాల్ట్
  • సాల్ట్ అద్భుత క్యాచ్‌తో ఇషాన్ కిషన్ ఔట్

IPL 2026 : ఐపీఎల్ -2026 సీజన్ ప్రాంరభమైంది. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించింది. అయితే, సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ క్యాచ్‌ను ఆర్సీబీ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ ( Phil salt) అందుకున్న తీరు ఈ మ్యాచ్‌కే హైలైట్‌ గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : IPL 2026 : మా ఓటమికి కారణం వారే.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక కామెంట్స్

చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ల ఫీల్డింగ్ విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకున్న తీరు మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది.

సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ దుకూడుగా ఆడుతూ బౌండరీలు బాదుతున్నాడు. సెంచరీ చేసేలా కనిపించిన ఇషాన్.. అభినందన్ వేసిన 16వ ఓవర్ చివరి బంతికి డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకిలేచి బౌండరీ లైన్ దగ్గరగా పడే క్రమంలో దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన సాల్ట్.. కుడివైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుత రీతిలో క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో జోరుమీదున్న ఇషాన్ (80; 38 బంతుల్లో 8×4, 5×6) పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. ఫిల్ సాల్ట్ అద్భుత క్యాచ్‌తో స్టేడియం సాల్ట్ నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ క్యాచ్ ఎస్ఆర్‌హెచ్ జట్టు పతనాన్ని శాసించిందని చెప్పొచ్చు.