LSG vs DC : సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనేది ప్రణాళికలో ఉందా? అక్షర్ పటేల్ ఆసక్తికర కామెంట్స్..
ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమీర్ రిజ్వీ అసాధారణ బ్యాటింగ్ కారణంగానే తాము లక్నో సూపర్ జెయింట్స్‌పై (LSG vs DC ) గెలిచామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 2, 2026 / 08:06 AM IST
IPL 2026 Rishabh Pant comments after Lucknow Super Giants lost match to Delhi Capitals (pic credit@ipl)
- లక్నో పై విజయం
- స్పందించిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్
LSG vs DC : ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమీర్ రిజ్వీ అసాధారణ బ్యాటింగ్ కారణంగానే తాము లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. గతేడాది అశుతోష్ శర్మ తొలి విజయాన్ని అందించగా.. ఈ సారి సమీర్ రిజ్వీ ఆ పని చేశాడని చెప్పుకొచ్చాడు.
ఎకానా స్టేడియంలో బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో అబ్దుల్ సమద్ (25 బంతుల్లో 36 పరుగులు), మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 35 పరుగులు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాజన్‌లు చెరో మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
LSG vs DC : అవే మా కొంపముంచాయి.. లేదంటేనా.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కామెంట్స్..
ఆ తరువాత 142 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ (70 నాటౌట్; 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. లక్నో బౌలర్లలో ప్రిన్సీ యాదవ్ రెండు వికెట్లు, మహ్మద్ షమీ, మోసిన్ ఖాన్ లు చెరో వికెట్ తీశారు.
ఇన్నింగ్స్ విరామంలోనే దాని గురించి మాట్లాడుకున్నాం
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు విజయం పై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన సమీర్ రిజ్వీపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు తన ఆటను మెరుగుపరచుకునేందుకు చాలా కష్టపడతాడని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ త్వరగా ముగిసినప్పటికి కూడా మధ్యలో ఉత్కంఠభరితంగా మారిందన్నాడు. ఓ మంచి భాగస్వామ్యం అవసరం అని ఇన్నింగ్స్ విరామ సమయంలో మాట్లాడుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక జట్టు బౌలింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నానని అన్నాడు. తాము బౌలింగ్ ప్రారంభించినప్పుడు పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభిస్తుందని అర్థమైందన్నాడు. అదే విషయాన్ని బౌలింగ్ చేసే తమ బౌలర్ల అందరికి తెలియజేసినట్లుగా చెప్పాడు.
Shreyanka Patil : రెడ్ డ్రెస్‌లో యమా హాట్‌గా భారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్..
ఇక తాను మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం పైనా అక్షర్ పటేల్ స్పందించాడు. మ్యాచ్ సాగుతున్న తీరును బట్టి, బౌండరీల దూరాన్ని గమనిస్తూ ఎవరితో బౌలింగ్ చేయించాలనేది నిర్ణయం తీసుకున్నామని అన్నాడు. అయితే.. ఆఖరిలో ఒకటి లేదా రెండు ఓవర్లలో తన అంచనాలు తప్పి ఉండవచ్చునని అన్నాడు.
ఇక రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనేది ప్రణాళికలో ఉందా? అనే ప్రశ్న ఎదురుకాగా.. ఉందని అక్షర్ సమాధానం ఇచ్చాడు. అలాగే అశుతోష్ శర్మ కూడా ఓ ఆప్షన్‌గా పెట్టుకున్నట్లుగా వివరించాడు. ఒకవేళ తాము ఆరంభంలో వికెట్లు కోల్పోకపోయి ఉంటే పరిస్థితులు మరో రకంగా ఉండేవన్నాడు.
