IPL 2026: హాఫ్ సెంచరీతో చెలరేగిన రిజ్వీ.. లక్నోపై ఢిల్లీ ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Pic Courtesy @ ANI
IPL 2026: ఐపీఎల్ 2026 లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. ఈ సీజన్ ను గెలుపుతో ప్రారంభించింది. తొలి మ్యాచ్ లోనే విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. లక్నోపై ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో లక్నోని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 142 పరుగుల టార్గెట్ ను మరో 17 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ చేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 47 బంతుల్లోనే 74 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో ట్రిస్టన్ స్టబ్స్ చక్కని సహకారం ఇచ్చాడు. స్టబ్స్ 32 బంతుల్లో 39 రన్స్ చేశాడు. వీరిద్దరూ జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశారు.
