IPL 2026: కదంతొక్కిన కోహ్లి, పడిక్కల్.. గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సూపర్ సెంచరీతో మెరిశాడు.
- Naveen
- Updated on- April 24, 2026 / 11:05 PM IST
IPL 2026: గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అదరగొట్టిది. గుజరాత్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 58 బంతుల్లో 100 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ సెంచరీ వృధా అయిపోయింది. 206 పరుగుల టార్గెట్ ను బెంగళూరు చేజ్ చేసింది. మరో 7 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గుజరాత్ ను చిత్తు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లి, పడిక్కల్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. కోహ్లి 44 బంతుల్లో 81 పరుగులు.. పడిక్కల్ 27 బంతుల్లో 55 పరుగులు బాదారు. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది 5వ విజయం. ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్ లో 2వ స్తానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది బ్యాక్ టు బ్యాక్ ఓటమి. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఊపు మీద కనిపించిన గుజరాత్.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది.
