Kaviya Maran : కావ్య పాప‌కు ఎవ‌రైనా చెప్పండ‌య్యా.. తుది జ‌ట్టులో న‌లుగురే ఆడ‌తార‌ని.. ట్రోలింగ్ మొద‌లు..!

ఈ సారి ఎలాగైనా క‌ప్పు కొట్టాల‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కోరుకుంటుంది. అందుక‌నే ఓన‌ర్ కావ్య మార‌న్ ఆధ్వ‌ర్యంలో ఎస్ఆర్‌హెచ్ టీమ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో వేలంలోకి దిగింది.

Kaviya Maran trolled after SRH Buy Pat Cummins RS 20 crore

Kaviya Maran trolled : గ‌త కొన్ని సీజ‌న్లుగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. ఎంతో న‌మ్మ‌కంతో వేలంలో కోట్లు పెట్టి కొనుకున్న ఆట‌గాళ్లు అస‌లు మ్యాచుల్లో పూర్తిగా నిరాశ‌ప‌రుస్తున్నారు. గ‌తేడాది వేలంలో ఇంగ్లాండ్ ఆట‌గాడు హ్యారీ బ్రూక్‌ ను రూ.13.5 కోట్లకు స‌న్‌రైజ‌ర్స్ ద‌క్కించుకుంది. అయితే.. అత‌డు ఒకే ఒక మ్యాచులో సెంచ‌రీ చేయ‌డం మిన‌హా పూర్తి సీజ‌న్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. దీంతో ఈ సారి అత‌డిని వేలానికి విడిచిపెట్ట‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ రూ.4 కోట్ల‌కు అత‌డిని ద‌క్కించుకుంది.

కాగా.. ఈ సారి ఎలాగైనా క‌ప్పు కొట్టాల‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కోరుకుంటుంది. అందుక‌నే ఓన‌ర్ కావ్య మార‌న్ ఆధ్వ‌ర్యంలో ఎస్ఆర్‌హెచ్ టీమ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో వేలంలోకి దిగింది. జ‌ట్టులో ఉన్న లోటు పాట్ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. టాప్ ఆర్డ‌ర్‌లో లెఫ్టార్మ్ బ్యాట‌ర్‌తో పాటు స్పెష్ట‌లిస్ట్ స్పిన్న‌ర్‌, పేస్ ఆల్‌రౌండ‌ర్ల‌ల‌ను మొత్త పెద్దంలో వెచ్చించి మ‌రీ ద‌క్కించుకుంది.

క‌మిన్స్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన స్టార్క్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌.. ఎంతో తెలుసా..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ హీరో ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్‌ను రూ.6.80 కోట్ల‌కు కొనుగోలు చేసింది. శ్రీలంక ఆట‌గాడు వానిందు హ‌స‌రంగను రూ.1.50 కోట్ల‌కు, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క‌మిన్స్‌ను రూ.20.50 కోట్లు వెచ్చించి మ‌రీ ద‌క్కించుకుంది. వీళ్ల‌ను తీసుకోవ‌డంతో టీమ్ బ‌ల‌హీన‌త‌ల‌ను అధిగ‌మించిన‌ట్లే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ అంద‌రూ విదేశీ ఆట‌గాళ్ల‌నే కొన‌డం పై అభిమానులు మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఎస్ఆర్‌హెచ్ పై ట్రోలింగ్ మొద‌లైంది.

కావ్య పాప‌కు ఎవ‌రైనా చెప్పండ్రా.. తుది జ‌ట్టులో న‌లుగురు విదేశీ ఆట‌గాళ్లు మాత్ర‌మే ఆడ‌తార‌ని అని సెటైర్లు వేస్తున్నారు. ఇప్ప‌టికే మార్‌క్ర‌మ్‌, క్లాసెన్‌, గ్లెన్ ఫిలిఫ్‌, మార్కో జాన్సెన్‌లు ఉండ‌గా ప్ర‌స్తుతం ట్రావిస్ హెడ్‌, హ‌స‌రంగ‌, పాట్ క‌మిన్స్‌ను తీసుకుంది.

WI vs ENG 2nd T20 : సిక్స్ ఇలా కొట్టాల‌ని ఇన్ని రోజులు తెలియ‌దు భ‌య్యా..! వీడియో వైర‌ల్‌

బ‌ల‌హీన‌త‌ల‌ను పూర్తిగా విదేశీ ఆట‌గాళ్ల‌తో భ‌ర్తీ చేసుకోవాల‌ని ఎస్ఆర్‌హెచ్ భావించ‌డాన్ని ప్ర‌ముఖ క్రికెట్ విశ్లేష‌కులు వెంక‌టేశ్ ప్ర‌సాద్ త‌ప్పుప‌ట్టారు. దేశీయ ఆట‌గాళ్ల‌పై ఫోక‌ప్ పెట్టాల్సి ఉంద‌ని అభిప్రాయ పడ్డాడు. కాగా.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ మ‌నీ ప‌ర్స్‌లో రూ.5.2 కోట్లు ఉండ‌గా మ‌రో ముగ్గురు ఆట‌గాళ్ల‌ను తీసుకోవాల్సి ఉంది.