Rinku Singh - Yash Dayal
Rinku Singh – Yash Dayal : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ ద్వారానే రింకూ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రింకూ సింగ్ గ్రూప్ దశలో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో ఆఖరి ఓవర్‌లో చివరి ఐదు బంతులను ఐదు సిక్సర్లు బాది తన జట్టును గెలిపించుకున్నాడు. అప్పుడు ఆఖరి ఓవర్‌ను యశ్ దయాళ్ వేశాడు. ఈ మ్యాచ్ రింకూ సింగ్ ను హీరోను చేస్తే యశ్ దయాళ్‌ను జీరోని చేసింది.
ఈ మ్యాచ్ తరువాత యశ్ దయాళ్ గుజరాత్ తరుపున చాలా మ్యాచులు ఆడలేదు. ఆ తరువాత గుజరాత్ అతడిని వేలానికి విడిచిపెట్టింది. ఐపీఎల్ 2024 మినీ వేలంలో అతడిని ఏ జట్టు కొనుగోలు చేయదని అంతా భావించారు. అయితే.. అనూహ్యంగా అతడి కోసం గుజరాత్ టైటాన్స్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అతడి కోసం పోటీ పడ్డాయి. చివరకు గుజరాత్ వెనక్కి తగ్గగా రాయల్ ఛాలెంజర్స్ అతడిని రూ.5 కోట్లకు సొంతం చేసుకుంది.
The @RCBTweets get Yash Dayal for INR 5 Crore ??#IPLAuction | #IPL
— IndianPremierLeague (@IPL) December 19, 2023
ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. రింకూ బాధితుడికి మంచి మొత్తం దక్కిందని, వచ్చే సీజన్‌లో అతడు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు.
కమిన్స్ రికార్డును బద్దలు కొట్టిన స్టార్క్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర.. ఎంతో తెలుసా..?