IPL 2020: వేలంలో తొలిసారి కోట్లు పలికిన ప్లేయర్లు

భారీ అంచనాలతో ఆరంభమైన ఐపీఎల్ వేలం వేడుకగా ముగిసింది. స్టార్ క్రికెటర్లతో పాటు తొలిసారి ట్రోఫీలో ఆడనున్న ప్లేయర్లు సైతం కోట్ల ధర పలికారు. కోల్‌కతాలో గురువారం జరిగిన ఈ వేలం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కొందరి ప్లేయర్లపై కనక వర్షం కురియగా.. మరికొందరు అమ్ముడుపోలేదు. అత్యంత ఉత్కంఠతతో విజయవంతంగా ముగిసింది.

కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా కోట్లలో ధరలు పలికిన ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.

యశస్వి జైశ్వాల్:
ఇతని పేరు భారత క్రికెట్ చరిత్రలో సుపరిచితమే. 17ఏళ్ల ఈ ప్లేయర్ పానీ పూరీలు అమ్మి జీవనం సాగించేవాడు. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్‌కు రూ.2.40కోట్లకు అమ్ముడుపోయాడు. 

 

రవి బిష్ణోయ్:
లెగ్ బ్రేక్ బౌలర్ రవి బిష్ణోయ్.. ఇండియా అండర్-19జట్టులో ఆడనున్న ఇతణ్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.2కోట్లకు సొంతం చేసుకుంది. రూ.20లక్షల కనీస ధరతో వేలానికి వచ్చాడు. 

 

విరాట్ సింగ్:
22ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కు రూ.1.9కోట్లకు అమ్ముడుపోయాడు. నవంబరులో సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో ఆడిన విరాట్.. టీమిండియా అండర్-19లో ఆడనున్నాడు.   

 

ప్రియమ్ గార్గ్:
అండర్-19 టీం కెప్టెన్ ప్రియమ్ గార్గ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కు రూ.1.5కోట్లకు అమ్ముడుపోయాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ ప్లేయర్ రంజీ ట్రోఫీ మ్యాచ్ లో్ అరంగ్రేట మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ నమోదుచేశాడు. 

 

కార్తీక్ త్యాగి:
మరో అండర్-19ప్లేయర్ రాజస్థాన్ రాయల్స్‌కు కనీస ధర రూ.20లక్షల నుంచి రూ.1.3కోట్లకు అమ్ముడుపోయాడు. అఫ్ఘనిస్తాన్ తో తలపడిన అండర్ 19ఫార్మాట్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి 9వికెట్లు పడగొట్టాడు. 

 

వరుణ్ చక్రవర్తి:
2019వేలంలో జయదేవ్ ఉనదక్త్‌తో కలిసి రూ.8.4కోట్లు పలికిన వరుణ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వేలానికి వదిలేసింది. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన ఈ ప్లేయర్ ఒక్క ఓవర్లో 25పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సారి వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇతణ్ని రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. 

ట్రెండింగ్ వార్తలు